Homeక్రీడలుKCC T20 Trophy 2023: క్రికెట్ లోనే మహాద్భుతం.. ఒకే ఒవర్ లో 46...

KCC T20 Trophy 2023: క్రికెట్ లోనే మహాద్భుతం.. ఒకే ఒవర్ లో 46 పరుగులు..!

KCC T20 Trophy 2023: సాధారణంగా క్రికెట్లో ఆరు బంతుల్లో అత్యధికంగా 36 పరుగులు మాత్రమే వస్తాయి. అది కూడా ఆరు బంతులకు ఆరు సిక్సులు కొడితే. మధ్యలో ఒకటి, రెండు ఎక్స్ట్రాలు వేస్తే తప్ప ఇంతకు మించి కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ క్రికెట్ లోనే అద్భుతమైన, అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించారు. ఒకే ఓవర్లో ఏకంగా 46 పరుగులు కొట్టి ఔరా అనిపించాడు ఒక క్రికెటర్.

క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టడమే అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెటర్లలో అతి కొద్ది మంది మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ నుంచి యువరాజ్ సింగ్ ఈ అరుదైన ఫీట్ సాధించగా, దేశవాళీ క్రికెట్లో రవి శాస్త్రి ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. ఒక ఓవర్ లో 36 పరుగులు పిండుకోవడమే గొప్ప అనుకుంటే.. తాజాగా ఓ బ్యాటర్ 46 పరుగులు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓవర్ లో ఆరు సిక్సులు, రెండు ఫోర్ల సాయంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఓవర్ లో బౌలర్ రెండు నో బాల్స్ వేయడంతో ఆ బ్యాటర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు.

కేసిసి ఫ్రెండ్లీ చాంపియన్స్ ట్రోఫీ లో..

కువైట్ వేదికగా జరుగుతున్న కేసిసి ఫ్రెండ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ -2023లో భాగంగా ఎన్సీఎం ఇన్వెస్ట్మెంట్ – సీసీ ట్యాలీ జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో ఈ అరుదైన ఫీట్ నమోదయింది. సీసీ ట్రాలీ బౌలర్ హర్మన్ సింగ్ వేసిన 15 వ ఓవర్లో ఎన్సిఎం ఇన్వెస్ట్మెంట్ బ్యాటర్ వాసుదేవ్ 46 పిండుకున్నాడు. వరుసుగా తొలి బంతి నో బాల్ ను సిక్సుగా బాదాడు. ఆ తర్వాత మళ్లీ నోబాల్ వేయగా దాన్ని ఫోర్ గా మలిచాడు. ఆ మరుసటి బాల్ సిక్స్ కోట్టగా, ఆ తరువాత బాల్ మళ్లీ నోబాల్ వేయగా దాన్ని సిక్స్ కొట్టాడు. ఆ తరువాత వరుసగా మూడు బంతులను సిక్సులుగా మలిచాడు. చివరి బంతిని ఫోర్ బాదాడు. ఈ విధంగా ఓవర్ లో మొత్తంగా 46 ఆరు పరుగులు వచ్చాయి. 6nb, 4B, 6, 6nb, 6, 6, 6, 4 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో మొత్తంగా ఎనిమిది బంతులు వేయగా అదనపు పరుగులతో కలిపి 46 రన్స్ వచ్చాయి. ఎక్స్ట్రాలు రూపంలో ఆరు పరుగులు రావడంతో భారీ స్కోర్ నమోదయింది. తొలి బంతి బౌలర్ చేతిలో నుంచి జారిపోగా.. ఈ హై ఫుల్ టాస్ ను వాసుదేవ్ సిక్సర్ కొట్టాడు. ఎంపైర్ నోబాల్ ఇవ్వడంతో బంతి పడకుండానే ఏడు పరుగులు వచ్చాయి. మరుసటి బంతిని ఫుల్ టాస్ వేయగా.. బ్యాట్ తోపాటు కీపర్ ను మిస్సయిన బంతి బౌండరీకి దూసుకెళ్లింది. రెండో బంతికి సిక్సు రాగా, మూడో బంతిని నోబాల్ గా వేశాడు. దీన్ని సిక్సర్ కొట్టాడు వాసుదేవ్. అనంతరం మరో రెండు బంతులను సిక్సులుగా బాదిన అతను చివరి బంతిని బౌండరీకి తరలించాడు. ఈ విధంగా మొత్తం 46 పరుగులు పిండుకున్నాడు.

RELATED ARTICLES

Most Popular