Ravindra Jadeja : అప్పట్లో షేన్ వార్న్ లెగ్ సైడ్ ఆవల పిచ్ చేసి బంతిని బ్యాట్స్ మెన్ వైడ్ అనుకొని వదిలేశాడు. కానీ అది ఆఫ్ సైడ్ కు గింగిరాలు తిరిగి ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది.. ఆ అద్భుతమైన బంతిని క్రికెట్ చరిత్రలోనే నంబర్ 1గా ఇప్పటివరకూ కీర్తిస్తుంటారు. ఇప్పుడు అచ్చం అలాంటి మాయనే మన రవీంద్ర జడేజీ చేశాడు. ‘బాల్ ఆఫ్ ది ఐపీఎల్ ’ గా మార్చేశాడు.
తాజాగా లక్నోతో జరిగిన చెన్నై మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజీ అద్భుతం చేశాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ షాక్ కు గురిచేశాడు. లెగ్ సైడ్ లో పడ్డ బంతి ఆఫ్ సైడ్ తిరిగి వికెట్లను గిరాటేసింది. ప్రపంచంలోని ఏ బ్యాట్స్ మెన్ కూడా ఆ బంతిని జడ్జి చేయలేనంత ప్రమాదకరంగా తిరిగి వికెట్లను పడగొట్టేసింది.
రవీంద్ర జడేజా వేసిన బంతిని మార్కస్ స్టాయినిస్ ఎదుర్కోలేక.. అర్థం చేసుకోలేక షాక్ అయిపోయాడు. ఎంతలా తిరిగిందంటే అసలు తాను అవుట్ అయ్యానా? లేదా? అని డౌట్ గా కొద్దిసేపు స్టాయినిస్ అలానే చూస్తుండి క్రీజులో నిశ్చేష్టుడిగా నిలుచుండిపోయాడు. ఐపీఎల్ లో ఈ బంతి ఒక అత్యుత్తమ బాల్ గా పిలుస్తున్నారు.
లక్నో ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో రవీంద్ర జడేజా ఈ అద్భుతమైన బంతిని విసిరాడు. లెగ్ స్టంప్ పై పడిన బంతి గిర్రున వేగంగా తిరిగి ఆఫ్ స్టంప్ ను పడగొట్టింది. చాలా మలుపు తిరిగింది. అసలేం జరిగిందో తెలియక స్టాయినిస్ బిక్కచూపులు చూసిన వీడియో వైరల్ అవుతోంది. తాను అవుట్ అయ్యానా? అంటూ ఎంపైర్లను అడుగుతూ స్టాయినిస్ పెవిలియన్ చేరాడు.
ఇక లక్నో తో చెన్నై మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. లక్నో జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులు చేసింది. అనంతరం వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది
https://twitter.com/IPL/status/1653716716189528065?s=20