https://oktelugu.com/

అదిగదిగో ఐపీఎల్‌

ఇంగ్లాండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌ ముగిసింది. టీ20 సిరీస్‌ అయిపోయింది. వన్డే సిరీస్‌ పూర్తయింది. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా హవానే కొనసాగింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లనూ టీమిండియా కైవసం చేసుకొని క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే..ఈ హవా ఇంతటితో ముగియలేదు. మున్ముందు మహా క్రికెట్‌ సంబరం ఉంది. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచే వేడుక వచ్చేస్తోంది. ఓ వైపు వేడి పుట్టిస్తున్న ఎండకు తోడు.. సాయంత్రంగానే ఆహ్లాదాన్ని పంచేందుకు ఐపీఎల్‌ సరికొత్తగా ముస్తాబవుతోంది. సిక్సర్ల మెరుపులకు.. ఉత్కంఠభరిత పోరుకు.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2021 / 12:26 PM IST
    Follow us on


    ఇంగ్లాండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌ ముగిసింది. టీ20 సిరీస్‌ అయిపోయింది. వన్డే సిరీస్‌ పూర్తయింది. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా హవానే కొనసాగింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లనూ టీమిండియా కైవసం చేసుకొని క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే..ఈ హవా ఇంతటితో ముగియలేదు. మున్ముందు మహా క్రికెట్‌ సంబరం ఉంది. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచే వేడుక వచ్చేస్తోంది.

    ఓ వైపు వేడి పుట్టిస్తున్న ఎండకు తోడు.. సాయంత్రంగానే ఆహ్లాదాన్ని పంచేందుకు ఐపీఎల్‌ సరికొత్తగా ముస్తాబవుతోంది. సిక్సర్ల మెరుపులకు.. ఉత్కంఠభరిత పోరుకు.. కళ్లు చెదిరే విన్యాసాలకు వేదికైన ఈ మెగా టీ20 లీగ్‌ ఈ సారి సొంతగడ్డపైనే నిర్వహించబోతున్నారు. అది మరో పది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.

    మరోవైపు.. కోవిడ్‌ భయం వెంటాడుతూనే ఉన్నా.. బయో బుడగ వాతావరణంలో ప్రపంచం మెచ్చిన ఈ లీగ్‌ కనువిందు చేయనుంది. ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకున్నా బుల్లితెరల ముందు ఫుల్లుగా వినోదం పంచడం ఖాయం. ఈసారి ఆరు నగరాలకే పరిమితమైన ఈ టోర్నీలో అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడడం.. ఎప్పటిలా కాకుండా అరగంట ముందే మ్యాచ్‌లు ఆరంభం కావడం విశేషం.

    లీగ్‌ ప్రారంభానికి ముందే ప్లేయర్స్‌ అందరూ వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. చెన్నై, పంజాబ్‌ లాంటి జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేశాయి. రోహత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, సూర్యకుమార్‌‌ యాదవ్‌ (ముంబై ఇండియన్స్‌), రిషబ్‌ పంత్‌, అశ్విన్‌తోపాటు అక్షర్‌‌ పటేల్‌, వోక్స్‌, ప్రధాన కోచ్‌ పాంటింగ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌) సోమవారం తమ జట్లలో చేరారు. ఒకట్రెండు రోజుల్లో జట్లన్నీ పూర్తిస్థాయిలో ఆటగాళ్లతో నిండిపోనున్నాయి. ఏప్రిల్‌ 9న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌తో పోరుకు తెరలేవనుంది.