Dunith Wellalage: ఏషియా కప్ లో భాగం గా నిన్న ఇండియా పాకిస్థాన్ కి మధ్య జరిగినా మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది. ఇక రిజర్వ్ డే ఉండటం వల్ల ఇండియా కి పాకిస్థాన్ కి మధ్య మొన్న సగం లో ఆగిపోయిన మ్యాచ్ నిన్న పూర్తిగా జరిగింది. దానివల్ల మనవాళ్ళు కంటిన్యూ గా మూడు రోజులు మ్యాచులు ఆడాల్సి వస్తుంది.ఇక ఈరోజు ఇండియా కి శ్రీలంక కి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఇక ఇండియన్ ఓపెనర్లు అయినా రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు కూడా కొద్దీ వరకు చాలా బాగా ఆడినప్పటికీ ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ అయినా దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో గిల్ బౌల్డ్ అవ్వడం జరిగింది. టీం స్కోర్ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు 19 పరుగులు చేసిన గిల్ అవుట్ అవ్వడం జరిగింది…
ఇక ఆయన తర్వాత నెంబర్ త్రి లో బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ కూడా కొద్దీ సేపు డిఫెన్స్ ఆడినప్పటికీ ఆయన కూడా మూడు పరుగులు చేసి వెల్లలాగే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది.ఇక ఆ వెంటనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ కూడా క్లిన్ బౌల్డ్ అవ్వడం జరిగింది.అయితే ఈ మూడు వికెట్లు కూడా వెల్లలాగే తీయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే 20 సంవత్సరాల ఒక కుర్రాడు ఇండియన్ దిగ్గజ క్రికెటర్లు అయినా రోహిత్ శర్మ ని, కోహ్లీ ని బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్ కి పంపించాడు అంటే ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది నిజానికి వీళ్లిద్దరు దిగ్గజ క్రికెటర్ల వికెట్లు తీస్తానని అతనుకూడా అనుకొని ఉండడు…
అయితే 90 రన్స్ కె మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా టీం ని కె ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేసారు అయితే రాహుల్ నిన్ననే ఒక సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇషాన్ కిషన్ కూడా ఇప్పటికే వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లో నాలుగు హాఫ్ సెంచరీ చేసి సూపర్ ఫామ్ ని మెయింటేన్ చేస్తున్నాడు.అయితే వీళ్లిద్దరు కూడా చాలా వరకు మంచి ఇన్నింగ్స్ ని ఆడినప్పటికీ 39 పరుగులుచేసిన రాహుల్ ని వెల్లలాగే అవుట్ చేయడం జరిగింది దింతో వెల్లలాగే ఇప్పటివరకు నాలుగు వికెట్లు తీసి ఇండియన్ బ్యాట్స్మెన్స్ మీద తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు…ఇండియా లో బెస్ట్ బ్యాట్స్మెన్స్ అయినా నలుగురి అవుట్ చేయడం అంటే మామలు విషయం కాదు. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో ఏ టీం తో అయితే ఆడిందో అదే టీంని కంటిన్యూ చేసినప్పటికీ ఒక శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో మాత్రం అక్షర్ పటేల్ ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది స్పిన్ పిచ్ కావడం వల్లే అలా చేసారు…