100 League -2025 : ఇటీవల పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ ట్రోఫీ నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా డబ్బు ఖర్చు పెట్టింది. స్టేడియాలను కొత్తగా మార్చింది. అయినప్పటికీ భారత్ ఆడక పోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. దీనికి తోడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. భారీగా పెట్టుబడి పెట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు భారీగా నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే వెళ్లిపోవడంతో స్పాన్సర్లు ఈ యాడ్స్ ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపలేదు. పైగా ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆ మాత్రం గుర్తింపు లేకుండా పోయింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. జట్టులో సమూల సంస్కరణలు అవసరమని మాజీ ఆటగాళ్లు పేర్కొన్నారు. ఆ దిశగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేసింది. త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 వరల్డ్ కప్ కు నూతన జట్టును ప్రకటించింది. అందులో సీనియర్ ఆటగాళ్లకు మొండి చేయి చూపింది. చాంపియన్స్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత.. పాకిస్తాన్ ఆటగాళ్లకు దారుణమైన ఓటమి ఎదురైంది.
Also Read : గత ఏడాది ఫైనల్లోకి.. ఈ ఏడాది SRH పరిస్థితి ఏంటో.. జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
ఒకరు కూడా అమ్ముడుపోలేదు
ఐపీఎల్ మాదిరిగానే 100 లీగ్ -2025 పేరుతో టోర్నీ నిర్వహిస్తుంటారు. ఇందులో 45 మంది పాకిస్తాన్ ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇటీవల 100 లీగ్ -2025 కి సంబంధించి వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్క పాకిస్థాన్ ఆటగాడు కూడా అమ్ముడుపోలేదు. ఒక ఫ్రాంచైజీ కూడా పాకిస్తాన్ ఆటగాడి పై ఆసక్తి చూపించలేదు. నయీమ్ షా, ఆయూబ్, ఇమాద్ వసీం, హసన్ అలీ, మహమ్మద్ హస్నైన్ వంటి ఆటగాళ్లు గత 100 లీగ్ లో ఆడారు. అయితే వారిని రిటైన్ చేసుకోవడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపించలేదు.. మరోవైపు 100 లీగ్ లో ఉన్న ఎనిమిది జట్లలో.. నాలుగింటిలో భారత్ కు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అందువల్లే పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోలేదని తెలుస్తోంది. 100 లీగ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు అమ్ముడుపోకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.. ” ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేకపోయారు. కనీసం గ్రూప్ దశలోనూ ఒకే మ్యాచ్ లో విజయం సాధించలేకపోయారు. అంతకుముందు ట్రై సిరీస్లో ఓడిపోయారు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టు ఎదుట సాగిల పడిపోయారు.. ఇప్పుడేమో 100 లీగ్ -2025 లో అమ్ముడుపోలేకపోయారు. ఇలా అయితే ఎలా.. మీ వల్ల పాకిస్తాన్ పరువు పోతోంది. ఒకప్పుడు గొప్ప గొప్ప ఆటగాళ్లు పాకిస్తాన్ దేశానికి ఆడారు. పాకిస్తాన్ దేశానికి ఐసీసీ ట్రోఫీలు అందించారు. మీరు మాత్రం స్వదేశంలో ఆడ లేకపోతున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉండేది అని చదువుకోవాల్సి వస్తుందని” పాక్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నిన్నేమో అడ్వాంటేజ్ అని కూశారు.. ఇప్పుడేమో షెడ్యూల్ అని వాగుతున్నారు..ఎవర్రా మీరంతా..