IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో బెంగళూరు పై విజయం సాధించింది. శుక్రవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఏకపక్షంగా గెలుపును సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 రన్స్ కొట్టింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ముస్తాఫిజుర్ నిలిచాడు. ఇతడు బెంగళూరు జట్టులో కీలకమైన నాలుగో వికెట్లు పడగొట్టాడు.
తొలి మ్యాచ్లో చెన్నై విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారని? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని? రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై టైటిల్ విజేతగా నిలుస్తుందని ప్రముఖ క్రీడా విశ్లేషణ సంస్థ క్రిక్ ట్రాకర్ అభిప్రాయపడింది. చెన్నై జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నది. ముంబై ఇండియన్స్ కు 15%, హైదరాబాద్ కు 12 శాతం, బెంగళూరుకు 10 శాతం, కోల్ కతా కు 8 శాతం, ఢిల్లీకి 8 శాతం, రాజస్థాన్ కు 8 శాతం, గుజరాత్ కు 8 శాతం, లక్నోకు ఆరు శాతం, పంజాబ్ కు ఐదు శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నది. ఆయా జట్లలో ఆటగాళ్లు, వారి క్రీడా నైపుణ్యం, గత ట్రాక్ రికార్డు ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు క్రిక్ ట్రాకర్ ప్రకటించింది.
గత ఏడాది చెన్నై జట్టు ఛాంపియన్ గా నిలిచింది. గుజరాత్ జట్టు రన్నరప్ గా నిలిచింది. అంతకుముందు టోర్నీని గుజరాత్ జట్టు ఎగిరేసుకుపోయింది. ఆ జట్టు వరుసగా రెండు సీజన్లో ఫైనల్ చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈసారి ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు 8 శాతం మాత్రమే అవకాశం ఉందని క్రిక్ ట్రాకర్స్ వెల్లడించడం విశేషం. గత రెండు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ కు ఏకంగా 15% టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని క్రిక్ ట్రాకర్ ప్రకటించడం విశేషం. ఇక గత సీజన్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించి.. పాయింట్లు పట్టికలో అట్టడుగులో ఉన్న హైదరాబాద్ జట్టు కప్ గెలిచే అవకాశాలు 12 శాతం వరకు ఉన్నట్టు క్రిక్ ట్రాకర్ ప్రకటించడం గమనార్హం.
అనిశ్చితికి మారుపేరైన టి20 లో ఏదైనా జరగొచ్చు. 2022 సీజన్లో గుజరాత్ జట్టు పై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ నుంచి వెళ్లిన హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. పెద్దపెద్ద ప్లేయర్లు లేకపోయినప్పటికీ మామూలు ఆటగాళ్లతో ఫైనల్ దాకా జట్టును తీసుకెళ్లాడు. ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏకంగా గుజరాత్ జట్టు దక్కించుకునేలా చేశాడు.. సో దీనిని బట్టి.. చెప్పేది ఏంటంటే రకరకాల సంస్థలు.. రకరకాల విశ్లేషణలు చేస్తాయి. పైగా ఇప్పుడు ఐపీఎల్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి వాటి విశ్లేషణ వెనుక ఎంతో కొంత డబ్బు పరమార్థం ఉంటుంది. అంతే అంతకుమించి ఏమీ లేదు.. ఇంకా టి20 సీజన్ నెలకు మించి ఉంది. అలాంటప్పుడు ఏ జట్టు అయినా తిరిగి పుంజుకోవచ్చు. ఐపీఎల్ కప్పు దక్కించుకోవచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Crictracker announced that the chennai team has a 20 percent chance of winning the title
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com