Home owner : కొన్ని సార్లు భలే భలే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా. ఇప్పుడు మనం అలాంటి ఓ ఫోటోను చూసేద్దాం. అది సరే కానీ గతంలో చాలా మంది ఓ స్త్రీ రేపు రా మా ఇంటికి అని రాసేవారు కదా. ప్రతి డోర్ మీద ఇలాంటివే రాసి ఉండేవి. అంటే దయ్యాలను నమ్మేవారు దయ్యం ఆ రాతలను చూసి వారి ఇంటికి రేపు వస్తుందని, మళ్లీ దాన్ని చూసి మళ్లీ వెళ్తుందని నమ్మేవారు. ఇక ఆ పదాలకు చాలా జాదూ ఉందని కూడా నమ్మేవారు. కానీ నిజంగా దయ్యాలు ఉంటే అంత మంచి దయ్యాలు ఉంటాయా?
ఇక ఈ విషయం పక్కన పెడితే ఇలాంటి కొన్ని వ్యాఖ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. కానీ దయ్యం గురించి కాదు దొంగల గురించి.. ఔనండీ బాబు.. వారు రాసి పెట్టిన లెటర్ ను చూస్తే భలే అనిపిస్తుంది. ఎందుకంటారా? మరి మీరే ఆ ఫోటోను చూసేయండి. చూశారా? ఆ ఫోటోలో ఉన్న డోర్ మీ లెటర్ లో ఏం రాసి ఉందో? సంక్రాంతికి ఊరు వెళ్లిన ఆ ఇంటి యజమాని ఓ బ్రహ్మాండమైన ఐడియాతో ఓ లెటర్ ను రాసి ఇంటి డోర్ కు పెట్టి వెళ్లాడు. అందులో ఫన్నీగా రాశాడు.
మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. నగలు, డబ్బు కూడా తీసుకొని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ ఓ లెటర్ ను రాసి ఇంటి డోర్ కు పెట్టి వెళ్లాడు. ఇక దీన్ని ఎవరో ఫోటో తీసి పెట్టడంతో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. పాపం దొంగలు వచ్చి ఇల్లు మొత్తం వెతికి ఏది దొరకకుండా వెళ్లిపోతే బాధ పడతారు అనుకున్నాడు కావచ్చు. ముందే వారికి ఎలాంటి కష్టం లేకుండా ఇంటి డోర్ కు లెటర్ పెట్టి వెళ్లాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా దొంగల భయంతోనే ఇబ్బంది పడుతున్నారు.
సీసీ టీవీలు పెట్టినా సరే ఈ దొంగల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. చైన్ స్నాచర్లు, ఇంట్లో చొరబడి మరీ దొంగతనం చేయడం వంటివి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఆన్ లైన్ మోసాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎలాంటి మోసానికి పాల్పడతారో కూడా తెలుసుకోవడం కష్టమే. అందుకే మీరు కూడా బయటకు వెళ్లాలి అనుకుంటే కచ్చితంగా జాగ్రత్త.