Zodiac Signs : గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఒక్కో గ్రహం ఒక్కో రాశిలో ఆరు నెలల పాటు ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారి పై ప్రభావం పడి.. ఆయా రాశులు కలిగిన వారికి రాజయోగం ఏర్పడుతుంది. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30న అక్షయ తృతీయ ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం ఏర్పడనుంది. దీంతో వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఇన్నాళ్లు ఉన్న కష్టాలు తొలగిపోయి ఇప్పటినుండి వారి జీవితాలు మారిపోతాయి. ఇంతకీ ఆయా రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : వృషభ రాశిలో సూర్యసంచారం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట బలం..
సింహరాశి వారికి గజకేసరి యోగం కలిసి రానుంది. అక్షయ తృతీయ రోజు నుంచి ఈ రాశి వారి జీవితం మారిపోయింది. వీరు కొత్తగా ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు. కొందరికి జీతం పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ నుంచి అదృష్టం పట్టింది. వీరు తమ జీవితంలో కొత్త విషయాలను చూస్తారు. ఇన్నాళ్లు లేని లాభాలను వ్యాపారులు ఎప్పుడు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అదనపు ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఓ ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యార్థుల పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
ధనస్సు రాశి వారికి గజకేసరి యోగం కారణంగా ధన లాభం కలగనుంది. ఈ రాశి వ్యాపారులు కొత్తగా ఎటువంటి పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి అధిక లాభాలు పొందుతారు. వీరికి లక్ష్మీ దేవి నిన్నంటే ఉండి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
గజకేసరి యోగం కారణంగా పై మూడు రాశుల వారి కాకుండా మరికొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అయితే వీరికి లక్ష్మీదేవి అదృష్టం భరించాలంటే ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. గజకేసరి యోగం ప్రతి ఏడాది కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా వరిస్తుంది. ఈ సందర్భంగా ఆయన రాశుల వారు ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు గజకేసరి