Sun transits in Taurus..
Zodiac Signs : గ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్య గ్రహం లేకపోతే మిగతా గ్రహాల గమనశక్తి కష్టమే. అందువల్ల సూర్య గ్రహానికి ప్రత్యేకత ఉంటుంది. అయితే సూర్య గ్రహం మే 15 నుంచి వృషభ రాశిలో సంచరిస్తుంది. జూన్ 15 వరకు ఇదే రాశిలో కొనసాగుతుంది. సూర్యుడు వృషభరాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. వీరి జీవితాల్లో అనుకోకుండా మార్పులు జరగనున్నాయి. అంతేకాకుండా కొందరు పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. ఇంతకీ సూర్యగ్రహం వృషభ రాశిలో సంచరించడం వల్ల ఏఏ రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం..
Also Read : శని ప్రదోష వ్రతం ప్రాముఖ్యత ఏంటి? దీనిని ఎలా చేయాలి?
సూర్య గ్రహం వృషభరాశిలో సంచరించడం వల్ల కుంభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
సింహ రాశి వారికి సూర్య గ్రహం సంచార ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు కొన్ని సవాలను ఎదుర్కొంటారు. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మనసులో ఏది అనుకుంటే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు.. కుటుంబ సభ్యుల మద్దతు వీరికి అధికంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకుంటారు. సోదరుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు, ప్రశంసలు ఉంటాయి. అధికారుల నుంచి విలువైన బహుమతిని పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి వారికి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఇన్నాళ్లు కష్టాలకు కూపిలో కూరుకుపోయిన వారు ఇప్పుడు అధికంగా డబ్బులు పొందుతారు. వ్యాపారులు ఎలాంటి పెట్టుబడులు పెట్టిన అధికంగా లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే అవి లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగులకు సోదరుల మద్దతు ఉంటుంది. తోటి వారి సహకారంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధి. కుటుంబ సభ్యుల మధ్య సంయమన వాతావరణం ఉంటుంది. అనుకోకుండా వీరంతా విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు.
కన్యా రాశి వారికి సూర్య గ్రహ ప్రభావం పడనుంది. ఈ రాశి వారు ఈ రోజు అధికంగా లాభాలను పొందుతారు. ఉద్యోగులు చేసే ప్రయత్నాలు అన్ని విజయవంతం అవుతాయి. దూరంగా ఉండే బంధువుల నుంచి శుభవార్తను వింటారు. స్నేహితుల సహకారంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోష వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో ఎక్కువ లాభాలను తీసుకొస్తాయి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Zodiac signs sun transits in taurus