Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆరు నెలలకు ఒకసారి రాశులు మారుతూ ఉంటాయి. ఇలా రాశులు మారిన సమయంలో మిగతా రాశులపై ప్రభావం పడి వాటి స్థితి గతులు మారుతూ ఉంటాయి. మే నెల 23న బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే నెల 26న చంద్రుడు వృషభ రాశిలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇలా రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల కొన్ని రాజులపై ప్రభావం పడుతుంది. చంద్రుడు చల్లదనానికి.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకుంటారు. బుధుడు ఐక్యతకు, తెలివితేటలు ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలోకి రావడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడి జీవితంలో అనుకొని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రభావం అయ్యే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : చంద్ర మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఆ దేవున్ని ఎలా సంతోషపెట్టాలి?
చంద్రుడు, బుధుడు ఒకే రాశిలో ఉండడంవల్ల వృషభరాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు ఐక్యతతో కూడుకొని ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాల నుంచి కొన్ని ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ చూపిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు కలయిక ప్రభావం పడింది. ఈ రాశి వారికి 11వ ఇంట్లో ప్రభావం చూపిస్తుంది. వ్యాపారం చేసే వారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సమాజంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి అదనపు మార్గం దొరుకుతుంది. కొత్త ఉత్తేజంతో ఉద్యోగంలో చేరుతారు.
బుధుడు, చంద్రుడు కలయికతో తులా రాశి వారి 8వ ఇంట్లో ప్రభావం పడింది. దీంతో ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభం వస్తుంది. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటి నుంచి లాభాలు వస్తాయి. సంబంధాలు మెరుగుపడతాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి వారికి రెండు గ్రహాల కలయిక ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి వారు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. సంబంధాలు మెరుగుపడతాయి. కొత్తగా ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు.