Radha Astami : అసలు రాధాష్టమి పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని విశిష్టత ఏంటి?

ఈ రోజూ రాధా రాణిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం చేస్తారు. భక్తి శ్రద్ధలతో రాధా రాణిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఐశ్వర్యం, సంపాద సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. రాధాష్టమి ఈ సంవత్సరం శుక్ల పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 10 వ తేదీన రాత్రి 11:11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రాత్రి 11:46 గంటల వరకు ఉంటుంది. అయితే ఈరోజు ఈ రాధాష్టమిని జరుపుకుంటారు.

Written By: Kusuma Aggunna, Updated On : September 11, 2024 5:09 pm

Radha Astami

Follow us on

Radha Astami :  రాధాకృష్ణల ప్రేమకు చాలా మంది బానిసలు ఉన్నారు. అయితే కొన్నిరోజుల కిందట అందరూ కూడా కృష్ణాష్టమి వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు రాధాష్టమి పండుగను జరుపుకుంటున్నారు. కృష్ణాష్టమి జరుపుకున్న 15 రోజులకు రాధాష్టమి పండుగను జరుపుకుంటారు. అయితే హిందూ సంప్రదాయంలో రాధాష్టమికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను భక్తులు ఎలా జరుపుకుంటారో.. రాధాష్టమి పండుగను కూడా అలానే జరుపుకుంటారు. ఈ రోజూ రాధా రాణిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం చేస్తారు. భక్తి శ్రద్ధలతో రాధా రాణిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఐశ్వర్యం, సంపాద సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. రాధాష్టమి ఈ సంవత్సరం శుక్ల పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 10 వ తేదీన రాత్రి 11:11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రాత్రి 11:46 గంటల వరకు ఉంటుంది. అయితే ఈరోజు ఈ రాధాష్టమిని జరుపుకుంటారు.

ఈరోజు పొద్దున్నే.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తరువాత ఇల్లు అన్ని శుభ్రం చేసుకుని పూజ ప్రారంభించాలి. అయితే పూజ చేసే ముందు రాధాకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి డానికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాతే పూజ ప్రారంభించాలి. నెయ్యి దీపం దేవుడు దగ్గర వెలిగించి పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. వేద మంత్రాలు, శ్లోకాలు, రాధా గాయత్రీ మంత్రం పఠించాలి. మళ్లీ సాయంత్రం పూజ చేసి భోగ్ ప్రసాదం సమర్పించాలి. ఆ తరువాత ఉపవాసాన్ని ముగించాలి. అయితే ఈ రోజు దానధర్మాలు, పేదలకు ఆహారం ఇవ్వడం వంటివి చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈరోజు మద్యం, మాంసం వంటివి తినకూడదు. వివాహం అయిన వాళ్లు పిల్లలు సంతోషంగా ఉండాలని, భర్త ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేస్తారు. అవివాహితులు మంచి భర్త రావాలని పూజిస్తారు. అయితే రాధను పూజించిన వారికి కృష్ణుడి ఆశీర్వాదాలు కూడా అందుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈరోజు భక్తి శ్రద్ధలతో రాధను పూజించి ఉపవాసం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని.. అలాగే కోరిన కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు. రాధా రాణిని పూజించకుండా శ్రీ కృష్ణుని పూజించడం కూడా వ్యర్ధమే. ప్రేమకు ప్రతిరూపంగా రాధాకృష్ణుని చూపిస్తారు. అయితే ఇద్దరిని పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే భార్యాభర్తల బంధం బలపడుతుంది. అలాగే అనురాగాలు కూడా పెరుగుతాయి. ఇద్దరి మధ్య ఏవైన మనస్పర్ధలు ఉంటే తగ్గుతాయి. తప్పకుండా ఈరోజు రాధను పూజించాలి. అయితే ఉత్తర భారతదేశంలో ఈ రాధాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి కుంకుమ పూజ కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ రోజు ఉట్టి కూడా కొడతారు. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా రాధాష్టమి పండుగను నిర్వహిస్తారు.