Why Lord Shiva Wears Ash: విష్ణు మూర్తుల్లో ఒకరైన బ్రహ్మ కమలంలో కూర్చొని మనుషుల తలరాతలు రాస్తాడు. విష్ణువు లోకాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే బ్రహ్మ, విష్ణువులు ఎంతో అందంగా ఆభరణాలు ధరించి సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. కానీ శివుడు మాత్రం పులి చర్మం ను ధరించి.. మెడలో రుద్రాక్ష మాల తో కనిపిస్తూ ఉంటాడు. అలాగే శరీరంపై ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం చితా భస్మం ను రాసుకుంటూ ఉంటాడు. మిగతా దేవతల కంటే భిన్నంగా శివుడు శరీరానికి చిత బస్మాన్ని రాసుకోవడం వెనుక చరిత్ర ఏంటి? శివుడు అలా ఎందుకు రాసుకుంటాడు?
శివుడు చితా భస్మం రాసుకోవడం వెనుక ఒక చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం సతీదేవి మరణించిన తర్వాత ఆమెను శివుడు విడిచిపెట్టలేక పోతాడు. దీంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భస్మం చేస్తాడు. అయితే ఆ భస్మం ను తన శరీరానికి రాసుకొని తనతోనే ఉన్నట్లు భావిస్తాడు. అంటే తనకు కావలసినవారు మరణించినా.. తనతోనే ఉన్నట్లు భావించేందుకు ఈ భస్మం ను రాసుకున్నట్లు చెబుతారు. అంతేకాకుండా మనిషి పుట్టుక, మరణం సహజం. లౌకిక బంధాలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక దారి పట్టాలని చెప్పేందుకు ఈ భస్మం ను శివుడు శరీరంపై రాసుకుంటాడు.
అయితే కొందరు మరణించిన వారి విషయంలో ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తి మరణించితే వారి కుటుంబ సభ్యులను దూరం పెడతారు. వారిని పట్టించుకోకుండా ఉంటారు. అయితే పుట్టుక, మరణం అనేది అంతా దైవ కార్యమే అని తెలిపేందుకే.. శివుడు చితాభష్మమును శరీరంపై రాసుకొని స్మశానంలోనే ఉంటాడని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. అందువల్ల మరణించిన వారి విషయంలో ప్రవర్తన వేరే విధంగా ఉండొద్దని చెబుతుంటారు.
Also Read: Lord Shiva : శివుడు పశుపతి అవతారం ఎందుకు ఎత్తాడు? దీని వెనుక కారణం ఏంటి?
ప్రతి ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు మరణం పొందుతాడు. అయితే ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా తన ఆత్మ.. తన భావాలు దగ్గర వారి తోనే ఉంటాయి అని చెప్పడానికే ఈ చితభష్మమును శివుడు శరీరానికి రాసుకుంటాడని అంటారు. పూర్వకాలంలో యుద్ధాల్లో పాల్గొనే క్షత్రియులు ముందుగా శరీరానికి చితా బస్మమును రాసుకునేవారు. తమకు మరణం అనివార్యమని, మరణం గురించి తమకు చింత లేదని తెలిపేందుకే ఇలా చేసేవారని చరిత్ర తెలుపుతుంది.
ఈ చితా భస్మం ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. హోలీ పండుగ రోజు మిగతా ప్రాంతాల్లో రంగులు చల్లుకుంటారు. కానీ కాశీలో మాత్రం చిత భస్మంతో హోలీ పండుగ నిర్వహించుకుంటారు. హోలీ రోజున శివుడు తన శరీరానికి చిత భస్మం ను రాసుకుంటాడని చెబుతారు. అలా శివుడు శరీరానికి చితా భస్మం ను ధరించి అంతా సమానమే అని చాటి చెప్పాడు.