Hanuman Jayanti 2025: అంజనీ పుత్రుడు.. హనుమంతుడు.. ఇలా ఎన్నో పేర్లు కలిగిన చిరంజీవి అయిన రామభక్తుడిని ఆరాధించేవారు చాలామంది ఉంటారు. ఎందుకు పురాణాల ప్రకారం హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణంలో కీలక ఘట్టంలో హనుమంతుడి పాత్ర ఉంటుంది. అయితే చిరంజీవి అయినా ఈ స్వామిని కొలవడం వల్ల ఎన్నో రకాలుగా జీవితం సంతోషంగా మారుతుందని భక్తులు నమ్ముతారు. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల స్వామి అనుగ్రహం ఉంటుందని అంటారు. అయితే సాధారణ రోజుల్లో కంటే హనుమాన్ జయంతి రోజున స్వామి వారిని సేవించడం వల్ల అత్యధిక పుణ్య పలితాలు పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. అసలు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయస్వామిని ఎలా పూజించాలి? ఏం చేయాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 22 గురువారం తెల్లవారిన 3. 22 గంటలకు హనుమాన్ జయంతి తిథి ప్రారంభమవుతుంది. మే 23 అర్ధరాత్రి 1. 12 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో ఆంజనేయస్వామిని కొలవచ్చని అంటున్నారు. అయితే భక్తులకు అభయం ఇచ్చే ఆంజనేయస్వామి వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ స్వామిని అనుగ్రహం చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. ఆ తర్వాత దగ్గర్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించుకోవాలి. రాముడికి అత్యంత ఇష్టమైన భక్తుడు ఆంజనేయస్వామి.. అందువల్ల ఈరోజు సీతారాములను సేవించడం వల్ల కూడా ఆంజనేయ స్వామి సంతోషిస్తాడు. ఎక్కడ రామ భజన ఉంటుందో అక్కడ ఆంజనేయస్వామి ఉంటారని అంటారు. అయితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లినవారు ఎర్రచందనంతో పాటు పూలు, పండ్లు స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత ఆలయంలో కూర్చొని చాలీసా, సుందరకాండను పటించాలి. ఈరోజు ఉపవాసం ఉండి నెల పైనే నిద్రించడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చు అని అంటున్నారు.
జాతకంలో దోషం ఉన్నవారు హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల తొలగించుకోవచ్చని అంటున్నారు. ఈరోజు దగ్గర్లోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా ను పాటించాలి. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారని అంటున్నారు. అలాగే ఈరోజు ఇతరులకు దానం చేయడం వల్ల కూడా ఆంజనేయ స్వామి ఎంతో సంతోషిస్తారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆలయాలు ఈరోజు మారుమోగాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమైన ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈరోజు ఉపవాస దీక్ష చేపట్టిన వారు హనుమాన్ స్వామికి బూంది లడ్డు, హల్వా అంటే తీయటి వస్తువులను స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అలాగే తమలపాకులు సమర్పించడం వల్ల కూడా కొన్ని దోషాల నుంచి విముక్తిని పొందవచ్చు. వీటితోపాటు మందార పువ్వులను ఆంజనేయస్వామికి సమర్పించాలి.