Single Movie Collection: ‘శ్రీవిష్ణు'(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ భారీ లాభాలు నిర్మాతల దగ్గర నుండి, ఎగ్జిబిటర్స్ వరకు అందుకోవడం వంటివి ఈమధ్య కాలం లో ఎప్పుడూ చూడలేదు. సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బయ్యర్స్ పెట్టిన ప్రతీ రూపాయికి పది రూపాయిలు ఎక్కువ వచ్చాయి. ఈ చిత్రం తర్వాత కూడా మన టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ, వాటికి ఈ రేంజ్ లాభాలు మాత్రం రాలేదు. ఉదాహరణకు ఈ చిత్రాన్ని నిర్మించిన గీత ఆర్ట్స్ సంస్థనే తీసుకోండి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ‘తండేల్’ చిత్రాన్ని విడుదల చేశారు. కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, కానీ వచ్చిన లాభాలు తక్కువే.
కానీ సింగిల్ చిత్రానికి ఇప్పటి వరకు ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. కమర్షియల్ భాషలో చెప్పాలంటే డబుల్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. థియేటర్స్ లో విడుదలై 13 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో 5 కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, సీడెడ్ ప్రాంతం లో కోటి 38 లక్షలు, ఆంధ్రా ప్రాంతం లో 5 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వారం లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల లేకపోవడం వల్ల ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి భారీగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా 13 రోజులకు కలిపి ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు గానూ 11 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా దుమ్ము దులిపేసింది అనుకోవచ్చు. ఎలాంటి చప్పుడు చేయకుండా విడుదలైన ఈ సినిమా కేవలం నార్త్ అమెరికా నుండే 7 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి . ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 7 కోట్లు మాత్రమే. ఫుల్ రన్ లో మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల మొదటి వారం లో ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవ్వొచ్చు.