Tamilnadu : భారతదేశం ఎన్నో సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. దేశంలో ఎన్నో రకాల దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దేశంలో ఉన్న చాలా ఆలయాలు పురాతన కాలం నుంచి ఉన్నాయి. అయితే దేశంలో వినాయకునికి చెందిన చాలా ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తమిళనాడు లోని ఓ ఆలయం మనిషి లానే నాడీ కొట్టుకుంటది. ఈ ఆలయం బ్రిటిష్ వారి కాలం నుంచి ఉంది. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఆ ప్రత్యకతలేంటి ? ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తమిళనాడులోని తిరునల్వేరి జిల్లాలోని కుర్తాళంలో నాడీ గణపతి ఆలయం ఉంది. ఇక్కడ ఎన్నో మఠాలతో పాటు జలపాతలు కూడా ఉన్నాయి. ఈ జలపాతం లో స్నానం చేస్తే ఎన్నో రకాల వ్యాధులని నాశనం చేస్తుందని అక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయం దగ్గర ఉండే చిత్రావతి జలపాతంలో స్నానం చేస్తే సర్వ రోగాలు పోతాయని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఈ జలపాతం ప్రవహించే అన్ని ప్రాంతాల్లో కూడా ఔషధానికి సంబంధించిన వనమూలికలు దొరుకుతాయని చెబుతుంటారు. అలాగే ఈ జలపాతం లో మానసిక వికలాంగులు స్నానం చేస్తే.. మానసిక సమస్యలతో పాటు శారీరిక సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ జలపాతం లో స్నానం చేయడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తుంటారు. అయితే నాడీ గణపతి అని పిలవడానికి ఓ స్టోరీ ఉంది.
ఒక మహా సిద్ధయోగి మౌన స్వామి ఈ ప్రాంతంలో తపస్సు చేయాలని ఒక మఠాన్ని ఏర్పాటు చేసి.. సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ తర్వాత వినాయకున్ని కూడా ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఏంటని హేళన చేశారు. అప్పుడు ఆ యోగి డాక్టర్ ని పిలిపించి రాత్రి విగ్రహానికి నాడీ పని చేస్తుందా లేదా అని చెక్ చేయించారు. ఆ తర్వాత రాత్రి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి.. మళ్లీ డాక్టర్ చేత నాడి చెక్ చేయించారు. విగ్రహ ప్రతిష్ట తర్వాత ఆ వినాయకుని నాడీ కొట్టుకోవడం వినిపించింది. దీంతో డాక్టర్, గవర్నర్ ఇద్దరు షాక్ అయి.. మౌన స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకే ఇక్కడ వినాయకుని తొడల నుంచి నాడీ శబ్దం రావడం వల్ల వినాయకుడిని తొడలు ఎప్పుడు కప్పే ఉంచుతారు. వినాయకుని కాళ్లకు ధోతి కట్టే ఎప్పుడు ఉంటుంది. అప్పటినుంచి ఇప్పటివరకు భక్తులు వెళ్లి ఆ జలపాతంలో స్నానం చేసి దేవుడుని దర్శించుకుని వస్తారు. ఈ వినాయకుని దగ్గర భక్తులు ఎప్పుడు భారీ సంఖ్యలో ఉంటారు. ఈ వినాయక సందర్భంగా మీరు కూడా ఏదైనా కొత్త వినాయకుని ప్లేస్ కి వెళ్లాలనుకుంటే నాడీ గణపతిని దర్శించుకోండి.