Tirumala Temple: ప్రపంచంలో కొన్ని అరుదైన జంతువులు ఉంటాయి. వీటి ద్వారా మనుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండడం వల్ల వాటిని కొందరు కాపాడుతూ వస్తున్నారు. సివెట్ క్యాట్ అనే జంతువును తెలుగులో పునుగు పిల్లి అని పిలుస్తారు. ఇది ఆసియా ఖండంలోనే అరుదైన జంతువుగా పేర్కొంటారు. ఈ పిల్లి శరీరం నుంచి సువాసన వస్తుంది. దీని నుంచి తయారుచేసిన ద్రవ్యంతో ఇది ప్రత్యేకత సాధించుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో పునుగు పిల్లికి ప్రత్యేకత ఉంది. దీని నుంచి విడుదలైన తైలం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి విగ్రహానికి ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే?
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి ప్రత్యేక గుర్తింపు ఉంది.. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచం నుంచి తరలివస్తు ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకుంటే చాలు అని తెలుగువారు అనుకుంటారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవంగా పేర్కొనబడే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నిత్యం తేజస్సుతో కనిపిస్తుంది. అయితే ఈ విగ్రహం అలా కనిపించడానికి పునుగు పిల్లి తైలం అని చెబుతున్నారు. పునుగు పిల్లి చెమట ద్వారా ఏర్పడిన తైలం తో శ్రీవారి విగ్రహానికి రాస్తూ ఉంటారు. ఇలా రాయడం వల్ల విగ్రహం సమీపంలో సువాసన రావడంతో పాటు ఎప్పుడు విగ్రహం తేజస్సుతో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా విగ్రహానికి పగుళ్లు రాకుండా కూడా కాపాడుతుందని అంటున్నారు. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తారని సమాచారం.
పూర్వీకుల సమాచారం ప్రకారం శేషాచలం అడవుల్లో పునుగు పిల్లులు ఉన్నట్లు గుర్తించారు. అయితే రానున్న కాలంలో ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఉద్దేశంతో వీటిని సేకరించి ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటిని టీటీడీ గోశాలలో పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాతి పిల్లలను సంరక్షణ కోసం టీటీడీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. 1972 వన్యపాణి సంరక్షణ చట్టంలోని క్లాసు ప్రకారం దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను ఉపయోగించుకోవచ్చని చట్టం ఉంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పులుగు పిల్లలు పెంచుతోంది.
పునుగు పిల్లలనుండి తైలం తీసేటప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. దీనిని ఒక ఇనుప జలాలలో ఉంచుతారు. అక్కడ చంద్రపు కర్రను ఏర్పాటు చేసి ప్రతి పది రోజులకు ఒకసారి శరీరపు గ్రంథాలను ద్వారా చెమట ద్వారా ఒక అట్టులా ఏర్పడుతుంది. దీనిని చందనపు కర్రకు రుద్దడం ద్వారా బంకల అది అంటుకుపోతుంది. దానిని తీసిన తర్వాత తైలం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పునుగు పిల్లి భారత్లో మాత్రమే కాకుండా సింగపూర్, మయన్మార్, భూటాన్ వంటి దేశాల్లో కూడా కనిపిస్తుంది.