Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 27న శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తరభాద్ర పద నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారస్తులకు ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే ఓ రాశి వారికి ఓ వార్త సంతోషాన్ని నింపుతుంది. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. పెండింగులో ఉన్న ప్రభుత్వ రంగ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆశించిన ఆదాయం ఉండకపోవచ్చు. కానీ అవసరాలకు డబ్బు అందుతుంది.
వృషభం:
వ్యాపారులకు అనుకూల సమయం. ఓ శుభవార్త వింటారు. ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆదాయంలో లోటు ఏర్పడుతుంది. కొన్ని అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.
మిథునం:
కష్టపడి పనిచేస్తారు. ఆశించిన లాభాలు పొందుతారు. కొన్ని విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవాలి. మానసిక సమస్యలు వచ్చే అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వ్యాపారులకు ప్రతికూల వాతావరణం.
కర్కాటకం:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అయితే అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టి తొందరపడొద్దు. సరైన సమయం కోసం వేచి చూడాలి.
సింహం:
కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. ఆర్థిక పరంగా ఆశించిన లాభాలు ఉంటాయి. ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.
కన్య:
ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థికంగా బలపడుతారు. ఇతరులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల విషయంలో కలత చెందే అవకాశం. ఎక్కువగా వాదనలో చేయకపోవడమే మంచిది.
తుల:
ఆదాయం ఆశించినంత ఉండకపోవచ్చు. అయితే భవిష్యత్ లో మంచి రోజులు ఉండే అవకాశం ఉంది. డబ్బు కోసం ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఒక్కోసారి కష్టపడినా సరైన ఫలితాలు రాకపోవచ్చు. నిరాశ చెందవద్దు.
వృశ్చికం:
కొన్ని విషయాల్లో గందరగోళానికి గురవుతారు. భవిష్యత్ లో వివాదాలు పెరిగే అవకాశం. వ్యాపారస్తులకు మాత్రం మంచిరోజనే చెప్పవచ్చు. ఆశించిన ఆదాయం అందుతుంది.
ధనస్సు:
గతంలో తీసుకున్న నిర్ణయాలపై విజయం సాధిస్తారు. సమస్యలు వెంటాడుతాయి. ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలి. కొత్త పనులకు సరైన సమయం కాదు.
మకరం:
ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల మంచిగా ఉండాలి. వారి సలహాలు తీసుకుంటే లాభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతంది. వ్యాపారులు బిజీగా గడుపుతారు.
కుంభం:
కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని పరిష్కరించడంతో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం.
మీనం:
బంధుమిత్రులు, స్నేహితుల వల్ల కొంత లాభం జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త సంతోషాన్ని నింపుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.