Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకరాం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనయోగం కలగనుంది. అలాగే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. అక్టోబర్ 18 బుధవారం 12 రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ముఖ్యమైన పనుల్లో శ్రద్ద వహించాలి. లేకుంటే సమస్యలు వస్తాయి. సన్నిహితులు, స్నేహితుల నుంచి గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృషభం:
ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారవేత్తలు కొన్ని కొత్త ప్రణాళికలు వేస్తారు.. లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మిథునం:
ఉద్యోగులు అనుకున్నలక్ష్యం నేరవేర్చుకుంటారు. అనవసర విషయాల జోలికి వెళ్లకూడదు. కార్యాలయంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికిఊరికే ఇవ్వకూడదు.
కర్కాటకం:
తెలివితో పనిచేయడం వల్లే సక్సెస్ అవుతారు. పెద్దలు చెప్పిన బాటలో వెళ్లండి.. వారు కూడా సంతోషంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం:
వ్యక్తిగత విషయాల్లో పనితీరునుపెంచుకోవాలి. కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపాల్గొంటారు. అనుకున్నకోరిక ఒకటి నెరవేరుతుంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏ పనిని నిర్లక్ష్యంగా చేయొద్దు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు విని సంతోషంగా ఉంటారు. ఓ పని మీకు ప్రత్యేకంగా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.
తుల:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడుతారు. దీర్ఘాకాలికంగా పెండింగులో ఉన్న పని పూర్తవుతుంది.
వృశ్చికం:
ఇప్పటికే కొత్త పనులను ప్రారంభిస్తే అవి శుభ పలితాలు ఇస్తాయి. కళా,నైపుణ్యాలపై ఫోకస్ చేస్తారు. ఇంట్లోవాళ్లకు గౌరవం ఇవ్వడం వల్ల మనశ్నాంతి ఉంటుంది. చుట్టూ ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది.
ధనస్సు:
అనవసర ఖర్చుల జోలికి వెళ్లకూడదు. ఏ పనినైనా శ్రద్ధపెట్టి పూర్తి చేయాలి. పోటీలో పాల్గొన్నవారికి విజయం తథ్యం. లావాదేవాల్లో అలసత్వానికి దూరంగా ఉండాలి.
మకరం:
ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి. సమస్యలు పరిష్కరించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. కొందరు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
దీర్ఘకాలికి ప్రణాళికలు లాభిస్తాయి. సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. ఓ ప్రభుత్వం పథకం నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు వద్దు.
మీనం:
కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. నిర్లక్ష్యం చేయొద్దు. అంచనాలుతప్పుతాయి. మనో నిబ్బరంతో ముందుకు వెళ్లాలి. వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.