Mahashivaratri : పరమ శివుడికి ఇష్టమైన రోజు మహా శివరాత్రి. ప్రతీ ఏడాది మహా శివరాత్రి రోజున భక్తులు శివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజున ఉపవాసం ఉండి.. రాత్రంతా జాగారం చేస్తారు. ఈరోజు శివుడిని దర్శనం చేసుకొని అభిషేకం చేయడంతో పాటు జాగారం ఉండడం వల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా మంది మహా శివరాత్రి రోజున మహాశివుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు సిద్ధమవుతన్నారు. మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు ఓం నమశ్శివాయ అనే నామస్మరణతో మారుమోగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహా శివరాత్రిని జరుపుకోనున్నారు.
అయితే ఈ రోజు బుధుడు కుంభ రాశిలో ప్రయాణం మొదలు పెట్టనున్నాడు. వైదిక క్యాలెండర్ ప్రకారం బుధుడు కొన్ని రాశుల్లో ప్రయాణం చేయడం వల్ల మిగతా రాశుల వారికి విశేష ప్రయోజనాల కలగనున్నాయి. బుధుడిని చల్లని గ్రహంతో పాటుతెలివితేటలు, సంపదకు సంకేతంగా భావిస్తారు. బుధుడి ప్రయాణంతో ఆయా రాశుల వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. అప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. మరి బుధుడు కుంభరాశిలో ప్రయాణం మొదలు పెట్టిన సందర్భంగా ఏ రాశులపై ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..
బుధుడు కుంభ రాశిలోకి రావడం వల్ల మేష రాశికి అదృష్టం పట్టనుంది. ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందే మార్గాలు ఏర్పడుతాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. అధికంగా ఆదాయం పొందేందుకు అవకాశాలు వస్తాయి.
మిథున రాశి పై బుధ గ్రహ ప్రయాణం ప్రభావం పడనుంది. ఈ రాశి వారు కొత్తగా ప్రాజెక్టులు మొదలు పెడుతార. సంతాన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం కావడం తథ్యం. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందేందుకు సీనియర్లు మద్దతు ఇస్తారు.
సింహా రాశి వారికి అనుకూల పవనాలు వీస్తాయి. వీరు ఆర్థికంగా గతంలో కంటే మెరుగ్గా ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధికంగా లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల మద్దతుతో కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోని అదృష్టం వల్ల ధన లాభం అధికంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరి వల్ల లాభాలు పొందుతారు.
మకర రాశి వారికి మహా శివరాత్రి నుంచి ధన లాభం రానుంది. నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయంలో ఆరోగ్యం కుదుటపడి సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ఇవి లాభాలను తెచ్చిపెడుతాయి. బంధువుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది.