Chilkur Balaji Temple: ఆయనకు మొక్కుకుంటే అమెరికాకు వెళ్లొచ్చు.. భారతీయులకు విదేశీ వీసా జారీ చేస్తున్న ఈ ఆలయం కథ తెలుసా?

డాలర్‌ డ్రీమ్‌.. ఎక్కువ వేతనం.. మంచి కంపెనీలో జాబ్‌ చేయాలన్న కోరిక భారతీయ విద్యార్థుల అగ్రరాజ్యం అమెరికావైపు నడిపిస్తోంది. దీంతో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Written By: Raj Shekar, Updated On : August 1, 2024 4:28 pm

Chilkur Balaji Temple

Follow us on

Chilkur Balaji Temple: అమెరికా వెళ్లాలని యువత.. తమ పిల్లలను అమెరికాలో చదివించాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. ఇలాంటి వారిలో 50 శాతం మంది తమ కల నెరవేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ధన వంతులకే పరిమితమైన విదేశీ విద్య, ఉద్యోగాలు ఇప్పుడు సామాన్యుడి దరి చేశాయి. బ్యాంకులు అందిస్తున్న రుణాలు, ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రతిభ ఉన్న చాలా మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. ఇక మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తమకన్నా ఉన్నతంగా చదివించాలని, ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. దీంతో అప్పులు చేసైనా పిల్లలను అమెరికా పంపిస్తున్నారు. దీంతో అమెరికా వెళ్లే భారతీయులు సంఖ్య వందల నుంచి వేలకు పెరిగింది. దీంతో అమెరికాలో భారతీయ జనాభా 12 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని ఆ దేశ సెస్సెస్‌ స్పష్టం చేసింది. ఇక అమెరికా వెళ్లిన వారు పెద్ద పెద్ద హోదాల్లో కూడా పనిచేస్తున్నారు. అక్కడే స్థిరపడినవారు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. సెనెటర్లుగా ఎన్నికవుతున్నారు. అయితే అమెరికా వెళ్లేందుకు ఆటంకాలను తొలగిస్తున్నాడు. తెలంగాణలోని ఓ దేవుడు. ఆయనకు మొక్కుకుంటే.. అమెరికా వెళ్లాలన్న కల నెరవేరుతోంది. దీంతో చాలా మంది ఆ ఆలయానికి క్యూ కడుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి అమెరికా వెళ్లాలన్న తమ కోరికను దేవుడికి విన్నవిస్తున్నారు. ఆయన మన్నించి భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడు. ఇంతకీ అమెరికా వీసా జారీ చేయించి.. కల నెరవేరుస్తున్న ఆ దేవుడు ఎవరు.. ఆలయం ఎక్కడందో తెలుసుకుందాం.

నిత్యం 1000 మంది..
తెలంగాణలోని హైదరాబాద్‌ సమీపంలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయం విదేశీ విద్యా కలను నెరవేరుస్తున్నారు. వీసా జారీలో ఉన్న ఆటంకాలను బాలాజీ తొలగిస్తున్నాడని భక్తులు నమ్ముతున్నారు. ఆలయానికి వెళ్లి మొక్కుకుంటే అమెరికా వెళ్తున్నామని చాలా మంది చెబుతుండడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతీ రోజు ఈ ఆలయానికి 1000 మంది వస్తారు. విష్ణువు అవతారమైన బాలాజీకి మొక్కుకుని ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే తమ కోరిక నెరవేరుతుందని నమ్ముతున్నారు.

కోరిక తీరాక 108 ప్రదక్షిణలు..
ఇక తమ కోరిక తీరిన తర్వాత భక్తులు ఇక్కడికే వచ్చి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. స్వామివారికి మొక్కుకుంటే కొలువు కూడా ఖాయమని చాలా మంది భక్తులు నమ్ముతారు. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారు కూడా ఇక్కడకు వచ్చి స్వామికి మొక్కుకుని 11 ప్రదక్షిణలు చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడకు వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తున్నారు.

1984 నుంచి ప్రారంభం..
ఇక ఇక్కడ ఈ ప్రదక్షిణల పద్ధతి 1984లో ప్రారంభమైంది ఒక పూజారి ఒక అద్భుత సంఘటనను గమనించినప్పుడు పద్ధతి మొదలైంది. పొలంలో బోరు వేస్తూ నీళ్లు పడాలని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా 108 ప్రదక్షిణల తర్వాత బోరులో నీరు పడిందట. దీంతో అప్పటి కోరిక నెరవేరిన భక్తులంతా 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పటి నుంచి వీసా ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. అమెరికన్‌ డ్రీమ్‌ను సాధించే వారి ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. వీసా దరఖాస్తుదారులకు సహాయం చేయడానికి బాలాజీ సహాయ పడతాడని భక్తులు బలంగా నమ్ముతున్నారు. అమెరికన్‌ డ్రీమ్‌ ఆకర్షణ చిల్కూరి బాలాజీ దేవాలయం వైపు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది, ఇది విదేశాలలో తమ కలలను సాకారం చేసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఆశ, ఆకాంక్షకు చిహ్నంగా నిలుస్తుంది.