Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కోరు ఒక్కో పని చేస్తుంటారు. కొందరు వారి చేతులను చూస్తే, మరికొందరు అద్దాన్ని, దేవుడిని లేదా వారికి ఇష్టమైన వారిని చూస్తుంటారు. అయితే ఉదయం లేచిన వెంటనే మనం చూసే కొన్ని వస్తువుల వల్ల బట్టి రోజుంతా మంచిగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఉదయం పూట కొన్ని వస్తువులను చూస్తే దరిద్రమంతా కూడా మీతోనే ఉంటుంది. మీరు రోజులో నిరాశగా, నష్టాలతో జరుగుతుంది. లేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవడం మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంటుందని ఇది మనకి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతారు. మరి ఉదయం పూట చూడకూడని ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అద్దం
చాలా మందికి ఉదయం లేచిన వెంటనే అద్దం చూసే అలవాటు ఉంటుంది. లేచిన తర్వాత ముఖం ఎలా ఉందని చూసుకుంటారు. అలాగే తలను కూడా దువ్వుకుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఈ రెండు అలవాట్లను ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిదని చెబుతున్నారు. నిద్ర లేవగానే అద్దంలో మన పాసి ముఖం చూడటం వల్ల అరిష్టంతో పాటు దురదృష్టాన్ని తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజంతా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని ఏ పని అనుకున్న కూడా జరగదని పండితులు అంటున్నారు. లేచి దేవుడిని పూజించిన తర్వాత అద్దంలో ముఖం చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.
గోడ గడియారాలు
కొందరు లేచిన వెంటనే సమయం ఎంత అయ్యిందని గోడ గడియారాన్ని చూస్తారు. ఇలా చూడటం అశుభం అని నిపుణులు అంటున్నారు. వీటిని చూడటం వల్ల రోజంతా చెడు జరుగుతుందట. ఏ పని కూడా సరిగ్గా కాదు. అన్ని పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయని పండితులు అంటున్నారు.
పెయింటింగ్స్
ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఇంటి అలంకరణ కోసం పెయింటింగ్స్‌కు గోడకు పెడుతుంటారు. ఇందులో కొన్ని జంతువులు, హింసాత్మక ఘటనలు కూడా ఉంటాయి. వీటిని ఉదయాన్నే చూడటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని లేచిన వెంటనే చూడకూడదని చెబుతున్నారు.
నీడ
కొందరికి వారి నీడను చూసుకోవడం అంటే ఇష్టం. అయితే ఇలా చూసుకోవడం వల్ల పనుల్లో ఆటంకం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బు నష్టపోతారట.
గిన్నెలు
కొందరు బద్దకంగా రాత్రిపూట గిన్నెలు క్లీన్ చేయకుండా వదిలేస్తారు. ఉదయం లేచిన వెంటనే వాటిని శుభ్రం చేయడానికి చూస్తారు. ఇలా ఎంగిలి గిన్నెలను ఉదయం పూట లేచిన వెంటనే చూడటం మంచిది కాదన నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దరిద్రం ఇంట్లోనే తిష్ట వేసి ఉంటుందని పండితులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.