Varuthini Ekadashi 2025: హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని పండుగలు ప్రత్యేక దినాల్లో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం పొందవచ్చు అని పండితులు చెబుతారు. అందువల్ల సాధారణ పండుగ రోజుల్లోనే కాకుండా కొన్ని ప్రత్యేక రోజుల్లో కూడా పూజలు చేయడం వల్ల ఏలనాటి పుణ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఏడవదిలో మొదటిగా వచ్చేది చైత్రమాసం. ఈ మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక రోజులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండిపోతాయి. వీటిలో వరూథిని ఏకాదశి ఒకటి. సాధారణంగా ఏకాదశి ప్రతి నెలలో కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని నెలల్లో వచ్చే ఏకాదశి ప్రముఖమైనదని పండితులు చెబుతున్నారు. 2025 ఏప్రిల్ 24వ తేదీన వరూథిని ఏకాదశి రాబోతుంది. ఈరోజు నా ఎటువంటి పూజలు చేయాలి? వరూథిని ఏకాదశికి ఉన్న చరిత్ర ఏంటి?
మిగతా పర్వదినాల లాగానే వరూథిని ఏకాదశి రోజున కొన్ని పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. ఈరోజు వైష్ణవాలయాలో ప్రత్యేక పూజలు చేయాలని అంటున్నారు. వెంకటేశ్వర స్వామి, రామాలయం, కృష్ణ ఆలయాల్లో ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాన్ని పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఈరోజు రోజంతా ఉపవాసం ఉండి పాలు, పండ్లు మాత్రమే తీసుకొని ఉండి వ్రతం చేస్తారు. సాయంత్రం గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేస్తే సూర్య గ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ పూజలతో పాటు ఇతరులకు దానం చేయడం వల్ల కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు. వరూథిని ఏకాదశి రోజున బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయాలని చెబుతున్నారు. అయితే ఉపవాసం ఉండడం ఇబ్బంది కలిగిన వాళ్లు ఇలా నీటి కుండను దానం చేయడం వలన సమానం ఫలితం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఆహారం, ప్రసాదం లేదా మంచినీళ్లను పంచిపెట్టిన అద్భుత ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
వరూథిని ఏకాదశి రోజుకు ప్రత్యేక చరిత్ర ఉంది. కుబేరుడి ఆస్థానంలో ఉన్న వరూథిని అనే దేవకన్య తన శాప విముక్తి కోసం ఈరోజున వ్రతం చేసిందని చెబుతున్నారు. వరూధిని ఏకాదశి రోజున వ్రతం చేయడం వల్ల తనకున్న కష్టాలని తొలగిపోయాయని చెబుతున్నారు. అందువల్ల జాతకంలో దోషం ఉన్నవారు.. తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న వారు వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ స్వామివారిని కొలవడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు. అలాగే ఈరోజు నారాయణ స్మరణ చేస్తూ ఉండటం వల్ల స్వామి ఆశీస్సులు పొందగలుగుతారని పేర్కొంటున్నారు.
అయితే వరూథిని ఏకాదశి రోజున ఇంట్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. ఈరోజు నా ఇంటిని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువు అవతార పటం వద్ద దీపం నుంచి నారాయణ స్మరణ చేసిన ఫలితం ఉంటుందని అంటున్నారు. అయితే వరూథిని ఏకాదశి రోజున వామన అవతార స్వామిని ఊహించుకొని పూజలు చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చని పేర్కొంటున్నారు.