Ugadi Rasi Phalalu 2024 : ఉగాది నుంచి ఈ రాశి వారికి కనకవర్షమే.. ఏదంటే అది అవుతుందట..!

కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మహాలక్ష్మి దేవత తోడుండనుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2, ఉంది.

Written By: Chai Muchhata, Updated On : April 8, 2024 8:28 am

Horoscope Ugadi 2024

Follow us on

Ugadi Rasi Phalalu 2024 : తెలుగు క్యాలెండర్ ఉగాదితో ప్రారంభం అవుతుంది. దీంతో ఈ పర్వదినాన్ని విశేషంగా చెప్పుకుంటారు.  తెలుగు క్యాలెండ్ ప్రకారం కొత్త సంవత్సరంతో పాటు వ్యాపార వ్యవహారాలను ఉగాది నుంచే ప్రారంభిస్తారు. మరోవైపు ఉగాది రోజున పచ్చడిని చేసుకుంటూ.. తీపి వంటలతో ఆనందంగా గడుపుతారు. సాంయంత్రం పంచాంగ శ్రవణం వింటారు. ఈ సందర్భంగా జాతక చక్రం కూడా ప్రారంభమవుతుంది. పండితులు ప్రజల భవిష్యత్ గురించి ఆలయల్లో వినిపిస్తూ ఉంటారు. కొందరు తెలుపుతున్న ప్రకారం ఓ రాశి వారికి ఈ ఏడాది సిరులు కురవనున్నాయట. ఏదంటే అదే జరుగుతుందట. ఆ రాశి ఏదో చూద్దామా..

2024 ఏడాదిలో ఏప్రిల్ 9న ఉగాది రానుంది. శోభకృత్ నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఉదయం గుమ్మానికి మామిడి తోరణాలు మొదలు, పచ్చడి తయారి, పిండి వంటలతో ఇంటిల్లి పాది బిజీగా ఉంటారు. వ్యాపారస్తులు తమ లెక్కలను ఇప్పటి నుంచి ప్రారంభిస్తారు. ఈరోజు ప్రకృతి వేడి కాస్త తగ్గి కొంచెం చల్లదనం కూడా ఉండనుంది. దీంతో ప్రజలుఆహ్లదమైన వాతావరణంగా గడుపుతారు.

ఉగాది అనగానే జాతక చక్రం గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు. ముఖ్యంగా కొందరు తమ జాతకం ఈ ఏడాదిలో ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ సందర్భంగా 12 రాశులకు సంబంధించిన పంచాంగం ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఈ పంచాంగం ప్రకారం ఓ రాశి వారికి కనక వర్షం గురియనుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఆ రాశి గురించి ఒకసారి పరిశీలిస్తే..

కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మహాలక్ష్మి దేవత తోడుండనుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2, ఉంది. ఈ నేపథ్యంలో వీరికి కావాల్సినంత డబ్బుతో పాటు ఆనందం  కూడా ఉంటుంది.   పెండింగు పనులు పూర్తి చేస్తారు. కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రతీ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటారు. నిత్యం మనశ్శాంతితో ఉంటారు. ఇతరులతో సరదాగా గడుపుతారు.