Ugadi Panchangam 2025 : తెలుగు వారికి ఉగాది కొత్త సంవత్సరం. ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు కొత్త దుస్తలు ధరించి, రకరకాల వంటలు తయారు చేసి సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఉగాది పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఉగాది రోజు ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి.. దేవుడిని పూజిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. అయితే ఉగాది రోజు చాలా మంది పంచాంగం చూసుకుంటారు. మరి ఈ కొత్త ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏయే రాశుల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read : ఉగాది పంచాంగం.. అదృష్టమంటే ఈ రాశుల వారిదే
మేష రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 7 గా ఉంది. అయితే ఆర్థిక సమస్యలు వీరికి ఈ ఏడాది తప్పవు.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5 ఉండగా.. రాజపూజ్యం 1, అవమానం 7 గా ఉంది. ఈ శ్రీ విశ్వావసు సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం 2 ఉండగా.. రాజపూజ్యం 4, వ్యయం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఈ ఏడాది కలసి వస్తుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 2 ఉండగా.. రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. అయితే ఆర్థిక పరంగా బాగుంటుంది. రుణ బాధలు తీరుతాయి
సింహ రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 2 ఉండగా రాజపూజ్యం 7 అవమానం 3గా ఉంది. ఈ ఏడాది వీరికి ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14 వ్యయం 2 ఉండగా.. రాజపూజ్యం 6 అవమానం 9 గా ఉంది. ఉద్యోగులకు, వ్యాపారాలకు బాగా కలసి వస్తుంది. డబ్బులు ఎక్కువగా పొదుపు చేస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 2 వ్యయం 14 ఉండగా.. రాజపూజ్యం 5 అవమానం 2 గా ఉంది. అయితే వీరు ఈ ఏడాది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5 ఉండగా.. రాజ్యపూజ్యం 1, అవమానం 5 ఉంది. అయితే వీరికి ఈ ఏడాది మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 14 ఉండగా.. రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. అయితే వీరికి అప్పుులు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ ఏడాది మొత్తం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉండగా.. రాజపూజ్యం 7, అవమానం 5 ఉంది. అప్పులు ఇతరులకు ఇవ్వకూడదు. ఆర్థికంగా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొ్ంటారు.
మీన రాశి
ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 ఉండగా రాజపూజ్యం 3, అవమానం 1 ఉంది. ధన సంపాదన బాగానే ఉంటుంది. అయితే కాస్త ఖర్చులు తగ్గించుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.