Ugadi 2024: ఉగాది వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

తెలుగు సంవత్సరాది సందర్భంగా వస్తున్న శ్రీ క్రోధి నామ సంవత్సరం మీ ఇంట ఆనందాలను పంచాలి. సంతోషాలను పెంపొందించాలి.. ఏడాది మొత్తం మీరు అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 9, 2024 8:24 am

Ugadi 2024

Follow us on

Ugadi 2024: వెనుకటి రోజుల్లో పండగ వచ్చిందంటే చాలు సందడి ఉండేది. స్మార్ట్ పరికరాలు అప్పుడు లేవు కాబట్టి.. మనుషులు మాట్లాడుకునేందుకు సమయం ఉండేది. మనసులు తెలుసుకునేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. స్మార్ట్ ఫోన్ జీవితంలోకి వచ్చిన తర్వాత మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం తగ్గిపోయింది. కుదిరితే వాట్సప్.. లేకుంటే వీడియో కాల్.. జీవితమంతా యాంత్రికం అయిపోయింది. దాన్ని మనం ఎలాగూ మార్చలేం కాబట్టి.. నలుగురితో నారాయణ అనాల్సిందే. ఇలాంటి సమయంలో పండగ పూట శుభాకాంక్షలు చెప్పాలి. అందులోనూ ఉగాది మన పండుగ కాబట్టి.. కాస్తంత వినూత్నత కలబోస్తే.. పండగ పూట విభిన్నత కనిపిస్తుంది.. శుభాకాంక్షలు చదివిన వారి మోములో కూసింత నవ్వు విరబూస్తుంది.. పైగా తొలి పండుగ కాబట్టి.. వారు కూడా మన మీద మరింత సానుకూల అభిప్రాయాన్ని పెంచుకుంటారు. ఇంతకీ వినూత్నంగా శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందామా..

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంత శుభమే జరగాలి. మనలో ఉన్న కోపాలను, ద్వేషాలను జయించాలి. సహనాన్ని పెంపొందించుకోవాలి. ప్రేమను వ్యాపింప చేయాలి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

శ్రీ క్రోధి నామ సంవత్సరం మీకు అన్ని శుభాలు కలిగించాలి. అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం తూలతూగాలి. ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలి. ఈ సంవత్సరం మీకు మధురమైన క్షణాలు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

తెలుగు సంవత్సరాది సందర్భంగా వస్తున్న శ్రీ క్రోధి నామ సంవత్సరం మీ ఇంట ఆనందాలను పంచాలి. సంతోషాలను పెంపొందించాలి.. ఏడాది మొత్తం మీరు అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

కుటుంబమే మన బలం. బంధువులే మనకున్న బలగం. వారందరూ బాగుండాలి. ప్రతి పండుగ ఇలాగే జరుపుకోవాలి. వేప చేదు లాగా కష్టాలు తొలగిపోవాలి.. మామిడి వగరులాగా బాధలు మాసిపోవాలి. చింత పులుపు లాగా వేదనలు అంతర్దానం అవ్వాలి. బెల్లం తీపి లాగా జీవితం బాగుండాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

జీవితంలో సంతోషం ఉండాలి. ఆ సంతోషానికి పండగలు పరమార్ధం కావాలి. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మీకు ప్రతి పండుగ అలాంటి సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఎన్నో బాధలు వస్తుంటాయి. ఎన్నో సంతోషాలు కూడా వస్తుంటాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని.. ప్రేమతో స్వీకరించి.. స్థిరంగా నిలబడే స్థైర్యాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

ఉగాది పచ్చడిలో షడ్రుచులు జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తాయి. ఈ పండుగ సందర్భంగా భగవంతుడు ప్రసాదించిన ఆ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

సరికొత్త ఆశలతో.. మధురమైన అనుభూతులతో.. కొంగొత్త భావాలతో.. అద్భుతమైన ఆలోచనలతో.. మీరు విజయ వైపు ప్రయాణించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

గడిచిపోయిన కాలం మీకు జ్ఞాపకాలు ఇవ్వాలి. కొత్త సంవత్సరంలో మీకు అంత శుభమే జరగాలి. మీరు చేపట్టే ప్రతి పని అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

ఈ పండగ పూట మీకు దూరంగా ఉన్న మీ మిత్రులకు, బంధువులకు అ
ఆన్ లైన్ ద్వారా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. వారికి అంతా మంచే జరగాలని కోరుకోండి. చుట్టూ ఉన్న బంధువులతో షడ్రుచుల సమ్మేళితమైన ఉగాది పచ్చడిని ఆస్వాదించండి. పంచాంగ శ్రవణాన్ని వినండి. పూజారి చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటించండి..