Tuesday Dos And Donts In Hindu Tradition: మంగళవారం అనగానే కొందరికి ప్రత్యేక భావన ఉంటుంది. ఈరోజు ఎటువంటి పనులు ప్రారంభించరాదని.. కొత్త వస్తువులు కొనుగోలు చేయరాదని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా శుభకార్యం నిర్వహించడానికి ఈ రోజును ఎంచుకోరు. మంగళవారం రోజుకు అధిపతిగా కుజుడు ఉంటాడు. అంటే శక్తి, ధైర్యం, ఉద్రేకానికి ప్రతీకగా కుజ గ్రహం ఉంటుంది. అయితే ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని నియమాలు కూడా పాటించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు మంగళవారం ఇలాంటి పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మంగళవారం నాడు ఆశుభం అని కొందరు భావించినా కూడా.. ఈరోజు కొన్ని పనులను ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున శక్తి, ధైర్యానికి ప్రత్యేకగా భావిస్తారు. అందుకే ఇవి కలిసిన పనులను చేయవచ్చని అంటుంటారు. ఉదాహరణకు వ్యాయామం ప్రారంభించడం.. ఆస్పత్రిలో జాయిన్ అయితే ఆపరేషన్ చేయించుకోవడం వంటి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నా కూడా సరైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మంగళవారం నాడు కొత్తగా వ్యాపారం ప్రారంభించడం.. కొత్త దుస్తులు కొనుగోలు చేయడం.. కొత్త దుస్తులను ధరించడం వంటివి చేయవద్దని చెబుతూ ఉంటారు. అలాగే మంగళవారం శుభకార్యాలకు కూడా నెలవు కాదని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఇనుము, నూనె వస్తువులను కొనుగోలు చేయవద్దని చెబుతూ ఉంటారు. ఇవి కొనుగోలు చేయడం వల్ల ఆశుభంగా భావిస్తారు.
అయితే మంగళవారం రోజున ఆధ్యాత్మిక వాతావరణం లో ఉండడంవల్ల దైవానుగ్రహం కలుగుతుందని అంటుంటారు. ముఖ్యంగా ఈరోజును ఆంజనేయ స్వామికి అంకితం చేశారు. ఆంజనేయస్వామి స్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని చెబుతూ ఉంటారు. స్వామివారికి ఇష్టమైన మందారం పూలు, సమర్పించి, బెల్లం శనగలు వంటివి పదార్థాలు ఇవ్వడం వల్ల ఇవ్వ ఫలితాలు జరిగే అవకాశం ఉందని చెబుతారు.మంగళవారం రోజున కుజుడు అధిపతిగా ఉంటాడు. ఇలాంటి సమయంలో కోపంలో తీసుకునే నిర్ణయాలు చెడు పలితాలను ఇస్తాయని చెబుతుంటారు. అందువల్ల ఈరోజు ఎక్కువగా వివాదాల జోలికి పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. మొత్తంగా మంగళవారం రోజును అశుభంగా భావించకుండా.. ఏ పనులు చేయాలి? ఏమి చేయకూడదు? అనే విషయాలు తెలుసుకోవడం వల్ల ఈ రోజును సరైన మార్గంలో ఉపయోగించుకోవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు.