Sitare Zameen Par : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అమీర్ ఖాన్(Amir Khan) ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటిరోజు ఈ చిత్రానికి కేవలం సింగిల్ డిజిట్ నెంబర్ మాత్రమే వస్తుందని అనుకున్నారు. పాజిటివ్ టాక్ రాకుంటే నిజంగా అలాంటి నెంబర్ వచ్చేదేమో. కానీ మొదటి ఆట నుండే పబ్లిక్ లో మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రానికి కాసుల కనకవర్షం రావడం మొదలైంది. మొదటి రెండు షోస్ కి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చినప్పటికీ, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ నుండి మాత్రం భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఫలితంగా మొదటి రోజు ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఒక సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఇక రెండవ రోజు అయితే మొదటి రోజు కంటే 85.98 శాతం ఎక్కువ వసూళ్లు నమోదు అయినట్టు బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వాళ్ళు అందిస్తున్న లెక్కల ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి 19 కోట్ల 90 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. నేడు ఆదివారం కావడంతో కచ్చితంగా ఈ చిత్రానికి 25 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. ఓవరాల్ వీకెండ్ కి ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం నెమ్మదిగా చాప క్రింద నీరు లాగా పాకుతుంది. మొదటి రోజు 8 లక్షల 52 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ రోజు ఏకంగా 1.27 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు రోజుల ఓవర్సీస్ కలెక్షన్స్ 2.12 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 18 కోట్ల 38 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. అలా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ ముగిసే సమయానికి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుండి కూడా ఈ సినిమాకు స్టడీ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ సినిమా లాంగ్ రన్ లో అద్భుతాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. చాలా కాలం ఫ్లాప్స్ తర్వాత అమీర్ ఖాన్ నుండి ఒక డీసెంట్ కం బ్యాక్ వచ్చిందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.