Today June 20 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వారికి ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కొన్ని బాధ్యతలు చేపడతారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు చట్టపరమైన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. నెట్వర్క్ ను ఉపయోగించుకొని కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొదుపు పెరగడంతో ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కష్టపడి పనిచేయడం ద్వారా లాభాలను పొందుతారు. దూరపు బంధువుల నుంచి ధన సహాయమందుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయ వనరులు పెరుగుతాయి. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉండే అవకాశం ఉంది. పూర్వికులు ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు ఆశాజనకమైన లాభాలు ఉంటాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనారోగ్యానికి గురై అవకాశముంది. వ్యాపారంలో గతంలో ఏర్పడిన నష్టాలను పూడ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇతరులకు అప్పు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలా ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో లాభాలు వచ్చే కొన్నిటిపై పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కష్టపడి పనిచేయడం వల్ల లాభాలు పొందుతారు. వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి వారసత్వంగా ఆస్తిని పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా పర్యటనలు చేయాల్సి వస్తుంది. ఇది వ్యాపారానికి సంబంధించిన లాభాలను తీసుకొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. డబ్బు విషయంలో నష్టపోయే అవకాశం ఉంది. కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉండరు ఉంది. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల పదోన్నతులు పొందే అవకాశం ఉంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగుల పనితీరుపై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది.