Homeఆధ్యాత్మికంToday horoscope in telugu ': ఈ రాశి వ్యాపారాలు ఈరోజు నక్క తోక తొక్కినట్లే.....

Today horoscope in telugu ‘: ఈ రాశి వ్యాపారాలు ఈరోజు నక్క తోక తొక్కినట్లే.. ఏదంటే అది పూర్తవుతుంది..

‘Today horoscope in telugu ‘: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఇందులో భాగంగా ద్వాదశ రాశులపై ఆదివారం పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు, బుధుడు, శుక్రుడు కలిసి నవ పంచమ యోగం ఏర్పాటు చేయనున్నారు. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనుల్లో విజయం మరిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. అయితే ఈ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి. ఆలస్యమైతే అనార్థాలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారాలు ఈరోజు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో కంటే ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . . ఈ రాశి వారికి చాలా రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కిరీపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియమైన వారికోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కొన్ని విభేదాలు ఏర్పడతాయి. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారులు కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణము ఉండనుంది. తల్లిదండ్రుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. విదేశాలను నుండి శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. బదిలీలు ఉండవచ్చు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే వెంటనే పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. ఆస్తుల పత్రాలపై సంతకం చేయాల్సి వస్తే ఆలోచించాలి. కళాత్మ రంగాల్లో ఉన్నవారు రాణిస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు మిగతా వారి కంటే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ జీతం పెరుగుతుంది. స్నేహితుల మద్దతుతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వివిధ రంగాలకు చెందిన వారు అనుకున్న పనులు సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తున్నా స్నేహితుల మద్దతుతో వాటిని అధిగమించుతారు. జీవిత భాగస్వామితో ప్రేమానుబంధాలు పెంపొందుతాయి. కుటుంబంలో కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే చాకచక్యంతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ధన రాశి వ్యాపారులు అధిక లాభాలు సాధించాలంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి కాస్త ఒత్తిడి ఉంటుంది. అయితే నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల ఇది పెద్దగా భారం కాదు. కొత్త సంబంధాలు మొదలవుతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . . ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. అయితే మాటలు మాట్లాడే సమయంలో కాస్త ఆవేశాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణంలో నెలకొనే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో శాంతంగా ఉండటమే మంచిది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. వ్యాపారులకు శత్రువుల పెడితే ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కొందరు వ్యక్తుల పరిచయం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. తల్లిదండ్రులు విద్యార్థి చదువు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. తెలివితేటలు ప్రదర్శించడంతో కుటుంబంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version