Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ రోజు శుక్రుడు చంద్రుడు కలిసి గజకేసరి యోగం ఏర్పాటు చేయనున్నారు. కొన్ని రాశుల వారికి ఊహించని దానికంటే ధన లాభం ఏర్పడుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. వేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. శారీరకంగా అనారోగ్యం ఎదురవుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉండడం వల్ల కాస్త అవకాశం కలుగుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తే పెద్ద సలహా తీసుకోవాలి. సొంత వాహనాలపై ప్రయాణం చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల్లో వాగ్వాదం ఏర్పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకతో సందడిగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరిగిన ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఒప్పందాలను చేసుకుంటారు. మానసికంగా ఆందోళనతో ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం అవుతారు. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. విదేశాల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సమస్యలు నెలకొంటాయి. అయితే మాటలు మాధుర్యంతో ఇవి పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో ఓపికగా ఉండాలి. కుటుంబంలో ఆందోళనకరణ వాతావరణం ఉంటుంది. మాటల మాధురియంతో సమస్యను పరిష్కరించుకోవాలి. ఆలోచన లేకుండా ఏ పని మొదలు పెట్టరాదు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. కొన్ని తప్పుల వల్ల సమాజంలో అవమానం ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత వీరు చేసే కొన్ని పనుల వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణముంటుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. అయినా ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేయరాదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొన్ని ఆర్థిక కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న విధంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. కొన్ని పనులు ఇష్టంగా లేకపోయినా చేయాల్సి వస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అంచనాలకు మించిన ఆదాయం వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. గతంలో ఉన్న కష్టాల నుంచి బయటపడతారు. వ్యాపారులు పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ అధిక లాభాలు పొందుతారు. అవసరాన్ని మించి ఖర్చులు చేయొద్దు. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. పాత స్నేహితుల్లో ఒకరు మోసం చేయవచ్చు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని సమయంలో కుటుంబ సభ్యులను సంప్రదించాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వైవాహిక జీవితం ఆందోళనగా ఉంటుంది. అవసరానికి తగిన ఆదాయం సమకూర్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి పొందే సమాచారం కలవరపెడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రతి పనిలో నిర్లక్ష్యం ఉండకుండా చేయాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సోదరుల మధ్య విభేదాలు ఉంటే అవకాశం. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా వరకు ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అన్ని విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. వినోదం కోసం పనిచేసే కొన్ని కార్యక్రమాల వల్ల సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఏర్పడుతుంది. వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి.