‘Today horoscope in telugu ‘: జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై శ్రవణా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు ధనయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా మంచి పనులు జరుగుతాయి. మరికొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉంటుంది. ఈ విషయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు లక్షలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు. సాయంత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరగడంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పనుల నిర్వహణలో అడ్డంకులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు తమ వైఫల్యాలతో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల గౌరవం పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన ఓ విషయాల్లో గందరగోళం ఏర్పడుతుంది. వ్యాపారులకు శత్రువులు ఏర్పడతారు. మీ ఆలోచనలతో ఎదుటివారికి ఇబ్బంది కలుగుతాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే మద్దూరు సంప్రదించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకోకుండా అదృష్టం కలుగుతుంది. వ్యాపారులు బిజీగా మారుతారు. వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. దూర ప్రయాణాలు మానుకోవడమే మంచిది. ఆర్థిక విషయాల్లో నైపుణ్య వ్యవహరించాలి. పిల్లలపై ఆందోళన చెందవద్దు. వారికోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు తమ వ్యాపారం పై ప్రత్యేక శ్రద్ధ పడతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూల వాతావరణం ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతి పొందుతారు. ఆరోగ్యంపై ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి రావడం కష్టంగా మారుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రాంతాలనుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. సమాజంలో కొన్ని పనుల వల్ల గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక నేల తీసుకుంటారు. మధ్యాహ్నం వరకు డబ్బు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈరోజు మౌనంగా ఉండటమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు పెట్టుకోవడం మంచిది కాదు. ఉద్యోగంలో ఉన్నవారికి లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. మనసులో ఏదో రకమైన ఆందోళన ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.