Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు గురుడు శుక్రుడు చంద్రుడు కుసుడు కలిసి చతుర్గ్రహి యోగం ఏర్పరచనున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉద్యోగులు పదోన్నతి ఉంది అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు పరిస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ప్రేమానుబంధాలు పెరిగిపోతాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ సమస్యలన్నీ పూర్తి చేసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాష్ట్ర ఉద్యోగులకు ఈరోజు కొన్ని కష్టాలు తప్పవు. ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొన్ని చిక్కుల్లో పడతారు. కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పనులు చేపట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు అనేక రంగాల్లో రాణిస్తారు. కొన్ని పనుల కోసం ఇతరులపై ఆధారపడే అవకాశం ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కొన్ని పరిస్థితులు మానసికంగా ఆందోళనకు గురిచేస్తాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగులకు గొప్ప అవకాశాలు వస్తాయి. ఏ పని చేపట్టిన వెంటనే పూర్తి చేస్తారు. ఆదాయం పెరగడంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటల కారణంగా ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. నీతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. శారీరక ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల ఉద్యోగులు లాభాలను పొందుతారు. వ్యక్తిగతంగా నష్టాలను ఎదుర్కొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కొన్ని పనులు చేపడితే వాటికి అడ్డంకులు ఎదురవుతాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉద్యోగులకు కలిసి రానుంది. వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే కాస్త కష్టపడాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబా సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోవాలి. అదనపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్న లాభం ఉండదు. వ్యాపారులకు నష్టాలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు నడపొద్దు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వ్యాపారాలు ఈరోజు లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా రంగాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రణాళిక లేకుండా పనులను ప్రారంభించవద్దు. ఉద్యోగులకు కొన్ని కష్టాలు ఎదురవుతాయి.