‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కష్టపడ్డ వారికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మనోధైర్యం జరుగుతుంది. ఇంత లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంకొక కొండ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి. అందువల్ల అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . . ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. గొప్ప వ్యక్తులతో స్నేహం చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి వ్యాపారాలలో అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. అయితే వీటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కష్టపడ్డ వారికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఓర్పు ఉంచుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితాలను ఉంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. బంధువులు ఇంటికి రావడంతో సందడిగా మారుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ధన సహాయం కావాలని అనుకునే వారికి బంధువుల నుంచి అందుతుంది. ఇతరుల వద్ద అప్పు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి మద్దతుతో వ్యాపారలు లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. అయితే ఇతరుల మాట విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో పాటు ఇంట్లో వాళ్లను చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. సమయాన్ని వృధా చేయకుండా ప్రయాణాలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు సహకరిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు వ్యాపార అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకునే వారు పెద్దల సలహా తీసుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . . ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్థాన మార్పు వల్ల కాస్త ఆందోళనగా ఉంటారు. వ్యాపారులకు శత్రువుల పెడదాం ఎక్కువగా ఉంటుంది. దీంతో లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు ఆగడం మంచిది. ప్రస్తుతం సమయం బాగాలేదు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. పెద్దల ఆశీర్వాదంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉండేవారిని శుభవార్తలు వింటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్తగా భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.