Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. మరికొన్ని రాసిన వారు కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాలని చూస్తే పెద్దలను సంప్రదించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరైనా డబ్బు అడుగుతే ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రత్యర్థులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం పొందుతారు. కుటుంబంలో ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాబట్టుకోవడం కష్టంగా మారుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి (మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆదాయం తగ్గడంతో కాస్త మనశ్శాంతి లోపిస్తుంది. అయితే ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు ఈరోజు లాభాలు పొందుతారు. శత్రుల విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపరాదు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో వ్యాపారులు సంప్రదింపులు చేస్తారు. డబ్బు వ్యవహారంలో ఎవరిని నమ్మకుండా ఉండాలి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యమైన జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. పాత స్నేహితులతో కలవడంతో సంతోషంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి డబ్బు వస్తే ఖర్చు చేయకుండా ఉండాలి. అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దుబారా ఖర్చులను నియంత్రించాలి. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను సీరియస్గా పూర్తి చేస్తారు. అవసరం లేకుండా వాదనలు చేయకుండా ఉండాలి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు చేసేవారు పెద్దలు సంప్రదిస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఇవ్వడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లోకి అతిథి రావడంతో సందడిగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అండతో వ్యాపారులను ప్రారంభించాలి. అధిక ఆదాయం పొందాలని అనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలక ప్రాజెక్టులను చేపడతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల పరీక్షలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే అనుకున్న ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ఎవరితోనైనా వాదన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాలని చూస్తే అనుకూలమైన వాతావరణ ఉండనుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.