Salman Khan : పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశం. ఆ దేశంలో ప్రజా సంక్షేమం ఉండదు.. అభివృద్ధి అనేది కనిపించదు. నిత్యం బాంబు మోతలు.. తుపాకుల శబ్దాలు.. మారణ హోమాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ ఒకచోట బాంబులు పేలి ప్రజలు చనిపోతూనే ఉంటారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోవు. అయితే ఇప్పుడిప్పుడే అమెరికా పాకిస్తాన్ దేశానికి బిచ్చం వేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ దేశంలో విలువైన వనరులు ఉండడమే.
ఈ కథను ప్రారంభంలో పాకిస్తాన్ దేశం గురించి అనేక విషయాలు చెప్పుకున్నాం కదా. వాస్తవానికి ఆ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని ఎవరైనా చెబితే.. పాకిస్తాన్ పాలకులకు తిక్క రేగుతుంది. ఎవరైనా పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఉన్నారని చెబితే వారిపై ఎటువంటి దుష్ప్రచారానికైనా పాకిస్తాన్ వెనుకాడదు. అయితే ఈసారి పాకిస్తాన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద పడింది. సల్మాన్ ఖాన్ కు పాకిస్థాన్ లో అభిమానులు భారీగానే ఉంటారు. అయినప్పటికీ పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ విషయంలో అడ్డగోలుగా మాట్లాడింది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక కారణం లేకపోలేదు.
ఇటీవల సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ దేశానికి తీవ్ర ఇబ్బంది కలిగించింది. దీంతో సల్మాన్ ఖాన్ పై పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. సల్మాన్ ఖాన్ ను ఏకంగా ఉగ్రవాదిగా సంబోధించింది. సల్మాన్ ఖాన్ ఉగ్రవాది అని పేర్కొంది. అంతేకాదు పాకిస్థాన్ లో యాంటి టెర్రరిజం యాక్ట్ లోని నాలుగో షెడ్యూల్లో ఆయన పేరును చేర్చింది. ఈ జాబితాలో ఉగ్రవాద లింకులు ఉన్న వ్యక్తులను చేర్చుతారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అతడు పాకిస్తాన్, బలూచిస్తాన్ పేర్లను వేరువేరుగా పేర్కొన్నాడు. దీంతో పాకిస్తాన్ దేశానికి ఒళ్ళు మండింది. కొంతకాలంగా బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న విలువైన వనరులు మొత్తం పాకిస్తాన్ పరిపాలకులు దోచుకుంటున్నారని.. విదేశీ శక్తులకు కట్టబెడుతున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఆందోళనలు పెరిగిపోయాయి. అంతేకాదు పాకిస్తాన్ సైన్యాన్ని ఇక్కడి తిరుగుబాటుదారులు అంతం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలిగించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ పరిపాలకులు బాలూచ్ ప్రాంతంలో సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నారు. అక్కడ ఆందోళనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అందువల్లే పాకిస్తాన్ దేశం సల్మాన్ ఖాన్ మాటలను తీవ్రంగా పరిగణించింది. అతనిపై ఏకంగా ఉగ్రవాది అనే ముద్ర వేసింది.
పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం పట్ల సల్మాన్ ఖాన్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశమని.. అటువంటి దేశం సల్మాన్ ఖాన్ పై ఉగ్రవాది అని ముద్ర వేయడం అత్యంత దారుణమని సల్మాన్ ఖాన్ అభిమానులు పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశం అనవసరంగా సల్మాన్ ఖాన్ తో పెట్టుకుందని.. దీనికి సరిపడా పర్యవసానాలను ఆ దేశం చవిచూస్తుందని సల్మాన్ ఖాన్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” .
pic.twitter.com/dFNKOBKoEz— Smita Prakash (@smitaprakash) October 19, 2025