Homeఆధ్యాత్మికం'Today horoscope in telugu ': శని ప్రదోషం వేళ.. ఈ రాశుల వారికి మార్దశ.....

‘Today horoscope in telugu ‘: శని ప్రదోషం వేళ.. ఈ రాశుల వారికి మార్దశ.. అనుకున్న పనులు పూర్తి చేస్తారు..

‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శని ప్రదోష వ్రతం ఉండడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన జీవితం ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం పై ఆందోళన చెందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు కెరియర్ పై ఎలక నిర్ణయం అందుకుంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. వ్యాపారులకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులు సీనియర్ సభ్యులతో సంయమనం పాటించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తల్లిదండ్రులు సలహాతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు అనుభవం ఉన్నవారి నుంచి సలహాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒకరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఒక పనిని పూర్తి చేయడానికి బిజీగా మారుతారు. ఉద్యోగులు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే వెంటనే తిరిగి చెల్లించే ప్రయత్నం చేయాలి. చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో ముందుంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు పూర్తి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఆత్మగౌరవం పెరగడంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో చర్చిస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు వస్తాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తులను నమ్మే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు లేకుండా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఉద్యోగులు కాస్త ఆందోళనలతో ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని విషయాల్లో వీరి మధ్య విభేదాలు రావచ్చు. అయితే ఈ సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు బదిలీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదరపు ఆదాయం కోసం అనేక ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు పొందుతారు. డబ్బు సంపాదించడానికి అనేకమార్గాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు అనేక రంగాల్లో ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. వ్యాపారులకు ప్రయోజనాలు ఉండలున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular