https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశుల వారికి లక్కీ డే… ఆస్తులు అమాంతం పెరిగే అవకాశం..

Today Horoscope In Telugu ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతుంది. దీంతో కాస్త ఆందోళనగా ఉంటుంది.

Written By: , Updated On : March 23, 2025 / 08:01 AM IST
Horoscope Today

Horoscope Today

Follow us on

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై ఆదివారం పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సూర్యుడితో కలిసి బుధుడు శుక్రుడు మీనరాశిలో ప్రయాణిస్తారు. దీంతో కొన్ని రాశుల వారి ఆస్తి అమాంతం పెరగనుంది. మరికొన్ని రాశుల వారు శత్రువుల బెడద ఎదుర్కొన్నారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే కాస్త కష్టపడాల్సి వస్తుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కొందరు శత్రువులు ఇబ్బందులు పెడతారు. కొత్త వారితో ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడం మానుకోవాలి. ఉద్యోగులు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. పిల్లలతో గడపకపోవడం వల్ల వారు నిరాశ చెందుతారు. ఈ కారణంగా కుటుంబంలో కొన్ని వాగ్వాదాలు ఏర్పడవచ్చు. స్నేహితుడు సహాయంతో అప్పులను తీరుస్తారు. ఉద్యోగులు అదరపు ఆదాయాన్ని పొందుతారు. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. మరికొన్ని పూర్తిగా కాకపోవడంతో నిరాశ చెందుతారు. అదనపు ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం పెరిగితే కాస్త మనశ్శాంతి ఉంటుంది. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. కుటుంబ సభ్యుల్లో గొడవలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. మాటలు పెరిగితే సంబంధాలలో చీలిక వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతుంది. దీంతో కాస్త ఆందోళనగా ఉంటుంది. కొన్ని పనుల కారణంగా అదనంగా ఖర్చులు పెరుగుతాయి. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంట్లో నిర్వహించే శుభకార్యం కోసం చర్చించుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ రాశి వారు రాజకీయ నాయకులు అయితే వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సాయంత్రం విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శత్రువుల పెడితే ఎక్కువగా ఉంటుంది. ఒప్పందాలు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు గౌరవం పెరుగుతుంది. తోటి వారి సహకారంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో జీతం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. దీంతో వారితో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాటలు అదుపులో ఉంచుకోవడం వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయి. అనవసరపు వివాదాలతో తల దూర్చకుండా ఉండాలి. తల్లిదండ్రుల సలహాతో వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులు కలవడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను ఉంచాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. సమస్య తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాపారులకు అధికంగా లాభాలు వస్తాయి. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి పొందే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాజు వారు ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఉద్యోగులు ఆందోళనలతో ఉంటారు. కొందరు సహకారంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంటికి బంధువులు రావడంతో సందడిగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూల వాతావరణాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతం పెరుగుదలపై శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. మందుల సలహాతో కొత్తపేటలో పెడతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు. తల్లితండ్రుల ఆశీర్వాదం ఉండటం ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాలు ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.