‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు మాలవ్య రాజయోగం ఏర్పడింది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఎవరైనా సలహా ఇస్తే దానిని పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తారు. అయితే వ్యాపారులు తోటి భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అందరూ మోసం చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ ఇస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు అందుతాయి. రిస్కుల జోలికి పోకుండా ఉండాలి. స్నేహితులు ఒకరి అనారోగ్యం గురించి ఆందోళన చెందు తారు. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు ఉద్యోగులు ఈరోజు పురోగతిని సాధిస్తారు. కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. లక్ష్యాలను పూర్తి చేయడంతో జీతం కూడా పేరుగే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు పరిశోధనలో పాల్గొంటారు. ఇందులో అనుకూల ఫలితాలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు తల్లిదండ్రుల సేవ తీసుకోవాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈరోజు వ్యాపారులు ఈరోజు నష్టాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే విలాసాల జోలికి వెళ్లకుండా ఉండాలి. పిల్లల చదువుపై శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులు కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరుగుతాయి. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనుంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. కొన్ని ఖర్చులు పెరిగిన ఇతర మార్గాల నుంచి ఆదాయం రావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. గతంలో పిల్లలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈరోజు వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణ ఉంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూలంగా ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు ఉంటే మౌనం వహించాలి. దూర ప్రయాణాలు వెళ్లకుండా ఉండడమే మంచిది. కొన్ని విమర్శలు ఎదురైనా అనుకున్న పనిని పూర్తి చేసుకోవాలి.