Homeఆధ్యాత్మికం'Today horoscope in telugu ': సర్వార్ధ సిద్దయోగంతో ఈ రాశుల వారికి అదనపు...

‘Today horoscope in telugu ‘: సర్వార్ధ సిద్దయోగంతో ఈ రాశుల వారికి అదనపు బలం.. ఊహించని లాభాలు..

‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై అనురాధా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు సర్వార్థ సిద్ధయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు ఉండలు ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన వస్తుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు బలహీనంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఖర్చులు ఎక్కువగా పెడతారు. అయితే కొందరు పొదుపు చేయడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరులకు అప్పగించేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి అనేక రంగాల్లో కష్టాలు ఎదురవుతాయి. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుక ముందు ఆలోచించాలి. వివిధ భాగస్వామితో విభేదాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లల చదువుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ప్రజల సలహా తీసుకోవాలి. ఆకస్మికంగా ఆర్థిక లాభములు ఉంటాయి. కార్యాలయాల్లో ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే తోటి వారి అడ్డంకులతో కాస్త కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు దీర్ఘకాలిక పెట్టుబడును పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది. ఇంటికి సంబంధించిన కొత్త వస్త్రాలను కొనుగోలు చేస్తారు. నీతిలో ఒకరి తన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొందరు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. షాపింగ్ చేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . మీరు ఆదివారం ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది.. స్నేహితుల నుంచి డబ్బు సహాయం పొందుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారికి ఈరోజు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మందుల నుంచి శుభవార్తలు వింటారు. ఎండింగ్ పనులను పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగుల జీవితాలు మలుపులు తిరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి జీవితం ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపారాలు అధికంగా లాభాలు పొందుతారు. కొందరు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఏదైనా పని కోసం బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. పిల్లల కెరీర్ పై శుభవార్తలు వింటారు. కార్యాలయాల్లో ఏదైనా సమస్యలు వస్తే ఉద్యోగులు తోటి వారి సహాయం తీసుకుంటారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . మీరు రాశి వారి జీవితం ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. వీరి పురోగతిని చూసి శత్రువులు అసూయపడతారు. అయితే అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు..

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు బిజీగా ఉంటారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తోటి వారి సాయం ఉండడంతో లక్ష్యం పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారు ఈ రోజు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. చాలా విషయాల్లో ఓపిక అవసరం. తండ్రి నుంచి కొత్త బాధ్యతలు తీసుకుంటారు. రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ప్రజల సలహా తీసుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వారి జీవితం ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. పిల్లలకు అనారోగ్యం వస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version