Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్రుడు శని రాహు బుధుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచనున్నారు. దీంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో కలిసి వస్తుంది. మీరు ఏ ఏ పనినైనా చురుగ్గా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. కష్టపడి పనిచేసిన వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలకు వెళ్లాలని అనుకునేవారు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. అయితే మాటలు మాధుర్యంతో సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు అదనపు ఆదాయం అందుతుంది. కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చులు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనుకోకుండా పర్యటనలు చేయాల్సివస్తే అవి లాభాలే ఉంటాయి. పెద్దల సలహాతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. సోదరుల మద్దతు ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సమన్వయం ఏర్పాటు చేసుకుంటారు. ఓ విషయంపై చర్చించే సమయంలో వాగ్వాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరులపై కోప్పడడం మానుకోవాలి. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ఇతరుల మద్దతుతో వాటిని పరిష్కరించుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. అయితే శాంతి సామరస్యంతో సమస్యను పరిష్కరించుకోవాలి. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చవద్దు. ఏదైనా విషయంలో కష్టపడి పని చేయాలి. అప్పుడే సరైన ఫలితాలు పొందుతారు. పిల్లల జీవితంపై నీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరిగిన దానికి తగిన ఖర్చులు ఉంటాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు సమయం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉండొచ్చు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేయడంతో వీరికి ప్రశంసలు అందుతాయి. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానివ్వద్దు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనిచేస్తారు. ప్రియమైన వారికోసం ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసే పెట్టుబడును లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీంతో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. వివాహితతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొన్ని పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాతావరణంలో మార్పులు ఏర్పడడంతో ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : సమయాన్ని వృధా చేసుకోకుండా పనులను పూర్తి చేసుకోవాలి. వ్యాపారులకు అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే కష్టపడి పని చేయడం వల్ల కొన్ని ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా కాస్త నిరాశతో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే లాభాలు వస్తాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులో ప్రారంభిస్తే సోదరులు సహాయం చేస్తారు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కొత్తగా ఏ ప్రాజెక్టు మొదలుపెట్టిన పెద్దల సలహా తీసుకోవాలి. మానసికంగా ఆందోళనతో ఉంటారు. జీవిత భాగస్వామి మద్దతుతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమను పాటించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ఆదాయం పెరిగిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి.