Homeఆధ్యాత్మికం'Today horoscope in telugu ' : ఈ రాశులపై శని దేవుడి అనుగ్రహం... ఆర్థిక...

‘Today horoscope in telugu ‘ : ఈ రాశులపై శని దేవుడి అనుగ్రహం… ఆర్థిక ఇబ్బందులు తొలగినట్లే..

‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశరాసులపై శనివారం పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు మీన రాశిలో శని దేవుడు సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వ్యాపారాలకు ఈరోజు లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర నష్టం ఎదుర్కొంటారు. స్నేహితులతో కలిసి మతపరమైన పర్యటనలు చేస్తారు. మహిళలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జాతులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. అంచనాలకు అనుగుణంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కొనుగోలు ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు. అయితే కొందరు లక్ష్యాలను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలతో మాట్లాడేటప్పుడు సమయం పాటించాలి. జీవిత భాగస్వామితో కలిసి మీ గారి యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థుల పోటీపరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకుని కొత్త పెట్టుబడులు పెడతారు. ఇది అధిక లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం. అయితే కొందరి అండతో వీటిని అధిగమిస్తారు. ప్రణాళికలు వేయడం ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఏర్పాటు చేసుకున్న కొన్ని పనులను పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. మహిళలతో వాగ్వాదాలు ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. పిల్లలతో కలిసి మెలిసి ఉండాలి. వారికి అవసరమైన మనలను సమకూర్చాలి. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి మనసు ఈ రోజు కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని పనులు కష్టపడి చేసినప్పటికీ పూర్తి కాకపోవడంతో మానసికంగా ఆందోళనలతో ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో వాగ్వాదాలు ఏర్పడతాయి. గతంలో కంటే ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొందరు శత్రువులు ఎదురవుతారు. దీంతో కొత్తవారిని నమ్మకుండా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇరుగుపొరుగు వారితో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశముంది. ఇష్టం లేని పని నాకు దూరంగా ఉండాలి. కొందరు పెద్దలు సలహా మేరకు మాత్రమే పని చేయాలి. స్త్రీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో గుర్తింపు వస్తుంది. అయితే దీనిని కాపాడుకునేందుకు మాటల మాధుర్యంతో ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని పరిస్థితి ఎదురవుతాయి. గతంలో కంటే ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. అయితే ఈ విషయంలో పెద్ద సలహా అవసరం ఉంటుంది. ఉద్యోగులపై అకారణంగా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మానసికంగా ఇబ్బందులు గురవుతారు. అయితే అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు పెద్దల విషయంలో జాగ్రత్త ఉండాలి. వ్యాపారులకు కొందరు ఇచ్చే సలహాలను వెంటనే పాటించవద్దు. వాటిని మరోసారి పెద్దలకు చెప్పి ఆ తర్వాత పాటించాలి. ఉద్యోగులకు తోటి వారి సంయమనం ఉంటుంది. అయితే కొందరు అడ్డంకులు సృష్టిస్తారు. ప్రతిభతో పనిచేస్తే సరైన ఫలితాలు ఉంటాయి. ఎవరిని నమ్మకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులు ధన సహాయం చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం. ఆరోగ్యం పై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండదు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చావద్దు. కుటుంబంతో వాదనలు ఉంటాయి. అయితే మాటలు అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వారు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనాలంటే అవకాశం ఇవ్వాలి. దేనితో అందులో విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మానసికంగా ఆలోచనలు ప్రతికూలమైతే వాటిని అదుపులో ఉంచుకోవాలి. కొందరితో వాదనలు దిగడం వల్ల ఆందోళనగా ఉంటుంది. కొన్ని పనుల కోసం ఓ వ్యక్తిని కలుస్తారు. మహిళలు సహాయంతో ఆర్థిక లాభం పొందుతారు. కొత్త పనిని ప్రారంభించేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తారు. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని పనుల వల్ల సమాజంలో గౌరవం కోల్పోతారు. అయితే ఇంట్లో మాత్రం కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్త వింటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version