Today 9 November 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు. మరి కొన్ని రాశుల వారు అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే పెద్దల సహా తీసుకోవడం మంచిది. బంధువులతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఉద్యోగులు అనుకున్న పనులు చేస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వీటి నుంచి బయటపడతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సమస్యలు ఉంటాయి. పిల్లల కెరీర్ పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. అధికారుల మద్దతు ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రజల మత్తుతో ఉన్న పనులను పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కొందరు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలి. స్నేహితుడు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొత్త ఆదాయ వనరులను ఎంచుకుంటారు. కొన్ని పనుల వల్ల బిజీగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు పితల సలహా తీసుకోవాలి. అదనపు ఆదాయం కోసం చూసేవారికి శుభవార్త అందుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ కలహాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకుంటారు
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులు బిజీగా ఉంటారు. కొత్త ఆదాయం వనరులు ఏర్పడతాయి. ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటే ఇతరులను సంప్రదించాలి. ఎందుకంటే డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొన్ని విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. భవిష్యత్తు గురించి కొత్త ప్రణాళికలు వేస్తారు. ఇంట్లో వాదనలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలి. పెద్ద వివాదం అయితే నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాలని అనుకునేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాదనలకు దూరంగా ఉండాలి. జీవనోపాధి రంగంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారాలు బిజీగా ఉంటారు. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. విదేశీ పర్యటన చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఆచితూచి వ్యవహరించాలి.