Today 9 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు మహాశివుడి ఆశీస్సులతో ఘననీయంగా లాభాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు అధికారుల నుంచి సపోర్ట్ తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దుబారా ఖర్చుల విషయంలో ఆలోచించాలి. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అనుకున్న లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి ఈ రోజు చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏదైనా పని చేసేటప్పుడు నిజాయితీగా ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యాపారులు గతంలో కంటే ఎప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఎవరితోనూ అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఉన్నతాధికారుల సహాయంతో ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రాయణాలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా శుభకార్యంలో పాల్గొంటారు. ఆన్లైన్లో వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. అయితే వీరితో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.