Homeఆధ్యాత్మికంToday 9 April 2026 Horoscope: ఈ రాశి వారు ఈ రోజు ఏ పని...

Today 9 April 2026 Horoscope: ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా విజయమే..

Today 9 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు శ్రీవారి అనుగ్రహం ఉండనుంది. దీంతో మొదలుపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బ్యాంకు రుణం తీసుకుంటారు. వ్యాపారులకు ఈరోజు కలిసి రావడం వల్ల అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గతంలో మొదలుపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సంతృప్తిగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఇంట్లో అనుకూలమైన వాతావరణ ఉంటుంది. దీంతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గతంలో చేసిన పొరపాట్లను ఈరోజు సరిదిద్దుకుంటారు. అధికారుల మద్దతు ఉండడంతో ఉద్యోగులకు ఈరోజు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. అవసరానికి డబ్బు అందడంతో సంతృప్తిగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థుల తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు వ్యతిరేకమైన పవనాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా వదులుకోవాలి. మానసికంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువే.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు ఉండడంతో విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి తోటి వారి సహాయముంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధించడంతో సంతృప్తిగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ప్రతికూలమైన వాతావరణము ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉండకపోవచ్చు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలిత ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి అనుకూలమైన వాతావరణాలు ఇస్తాయి. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version