Homeక్రీడలుక్రికెట్‌Gujarat Vs Delhi: గుజరాత్ గెలుపునకు.. ఢిల్లీ ఓటమికి ఆ "ఒక్కటే" కారణం.. ఐపీఎల్ లో...

Gujarat Vs Delhi: గుజరాత్ గెలుపునకు.. ఢిల్లీ ఓటమికి ఆ “ఒక్కటే” కారణం.. ఐపీఎల్ లో ఇదో అద్భుతం

Gujarat Vs Delhi: అది మామూలు మ్యాచ్ కాదు. చూసే వాళ్లకు ఉత్కంఠను కలిగించింది. ఆడే వాళ్లకు ఒత్తిడిని కలిగించింది. నిమిషం నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బంతి బంతికి సమీకరణం మారిపోయింది. బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారు.. విజయం చివరి వరకు దోబూచులాట ఆడింది. అంతిమంగా గెలుపును సొంతం చేసుకున్న జట్టు సంబరాలు చేసుకుంది.

ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఈ బ్యాచ్ లో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది.. ఆ తదుపరి కూడా అదే జోరు కొనసాగించింది. మొత్తంగా ఢిల్లీ ఎదుట 210 పరుగుల లక్ష్యాన్ని విధించింది.. సాయి సుదర్శన్ (12) విఫలమైనప్పటికీ, బట్లర్ చెలరేగి ఆడాడు.. ఫలితంగా గుజరాత్ జట్టు 77/1 వద్దకు చేరుకుంది. అప్పటికే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. కులదీప్ యాదవ్ బౌలింగ్లో అతడు అవుట్ అయ్యాడు. ఈ దశలో గిల్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. డీ జోడి మూడో వికెట్ కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ముఖ్యంగా విప్రాజ్ ఓవర్ లో గిల్, సుందర్ 23 పరుగులు రాబట్టారు. 17 ఓవర్ వరకు గుజరాత్ 182/2 వద్ద నిలిచింది. ఈ క్రమంలో 18 ఓవర్లో ఎంగిడి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. గిల్ వికెట్ పడగొట్టాడు. అయితే చివరి రెండు ఓవర్లలో సుందర్, ఫిలిప్స్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 25 పరుగులు వచ్చాయి. దీంతో గుజరాత్ ఢిల్లీ ఎదుట 211 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

211 పరుగుల టార్గెట్ రంగంలో జరిగిన ఢిల్లీ జట్టు మెరుపు ఆరంభాన్ని అందుకుంది.. నిశాంక, రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో పవర్ ప్లే లో 63/0 వద్ద నిలిచింది.. నిశాంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాహుల్ కాస్త నెమ్మదితనాన్ని ప్రదర్శించాడు. నిశాంక అవుట్ అయిన తర్వాత రాహుల్ దూకుడు మొదలుపెట్టాడు. ఢిల్లీ విజయం ఖాయం అనుకుంటున్న క్రమంలో రషీద్ రంగంలోకి దిగాడు. నితీష్ రానా ను అవుట్ చేశాడు.. సమీర్ రిజ్విని సున్నా పరుగులకు వెనక్కి పంపించాడు.అక్షర్ పటేల్ రెండు పరుగులు మాత్రమే చేసి రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 134/4 ఇబ్బందులలో పడింది.

మిల్లర్ కు గాయం

ఈ దశలో మిల్లర్ కు గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. దీంతో మ్యాచ్ మొత్తం గుజరాత్ వైపు వెళ్ళిపోయింది. అయితే రాహుల్ ఆడుతున్నప్పటికీ.. చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయి. స్టబ్స్(7) దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. రాహుల్ కూ డా అవుట్ కావడంతో ఢిల్లీ కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో వచ్చిన మిల్లర్ సిరాజ్ వేసిన 19 ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

చివరి ఓవర్ లో ప్రసిద్ వేసిన తొలి బంతికి విప్రజ్ ఫోర్ కొట్టాడు. అయితే రెండవ బంతికి అతడు రన్ అవుట్ అయ్యాడు. మూడో బంతి కి కులదీప్ యాదవ్ సింగిల్ తీశాడు. నాలుగో బంతిని మిల్లర్ సిక్సర్ కొట్టాడు. ఇక రెండు బంతుల్లో రెండు పరుగులు కావాలి. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ ఒప్పుకోలేదు. అయితే చివరి బంతిని మిల్లర్ సరిగా ఆడలేకపోయాడు.. బై కోసం ప్రయత్నించినప్పటికీ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కులదీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఉత్కంఠమధ్య ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version