Today 8 July 2025 Horoscope: జేష్ఠ నక్షత్రం ప్రభావం ఉన్న ఈ రోజు కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉండగలుగుతారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు అనుకున్నా లాభాలు రాకపోవచ్చు. అయితే కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు. ఈ తరుణంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న నిర్లక్ష్యం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటే మనశ్శాంతి కోసం ఓర్పు వహించాలి. ప్రమాదకరమైన పనుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. వ్యాపారులు భాగస్వాములతో పెట్టుబడులపై చర్చలు పెడతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో కొంత విలువైన సమాచారం అందుకుంటారు. సమాజంలో ఉండే వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. విద్యార్థులు కెరీర్ పై పోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. గతంలో చేసినా కృషికి నేడు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపార ప్రణాళికలు వేస్తారు. వీరికి పెద్దల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈరోజు ఊహించని లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు గతంలో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. పిల్లలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరికైనా అప్పు ఇస్తే ఈరోజు వసూలు అవుతుంది. వ్యాపారులు భాగస్వాములతో కొత్త పెట్టుబడుల గురించి చర్చిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . . ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారులకు మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. దూరపు బంధువుల నుంచి కొంత సమాచారం అందడంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందడంతో ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి జీవిత భాగస్వామికి ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి సంబంధాలు వస్తుంటాయి. విదేశాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు అనుకున్న పనులను సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. దీంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల మద్దతు పొందడంతో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడితే మౌనంగా ఉండటమే మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు ఇతరులకు డబ్బు అప్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే జీవిత భాగస్వామి సలహా అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి చేసే వ్యాపారం ఈరోజు లాభాలను తీసుకొస్తుంది. ఉద్యోగులు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. ఎవరైనా డబ్బు అప్పు అడిగితే ఇవ్వడానికి ముందుకు వెళ్ళండి. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే వ్యాపారం భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.