spot_img
Homeఆధ్యాత్మికంToday 5 May 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు ధనయోగం..

Today 5 May 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు ధనయోగం..

Today 5 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇంకా కొన్ని రాశుల వారికి ఈరోజు ధనయోగం పట్టణం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతారు. అయితే కొంత సమాచారం తెలుసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సివస్తే పెద్దలను సంప్రదించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభించవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నాలు చేయవద్దు. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడును పెడతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు అనుకున్న సమయంలో పనులను పూర్తి చేస్తారు. అయిపోయిన డబ్బు వసూలు అవుతుంది. విద్యార్థులు బోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు అందుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు వారు ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి. ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులన్నింటిలో విజయం సాధించవచ్చు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారులు తీసుకునే కొన్ని నిర్ణయాలతో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు వ్యాపారులకు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు స్టాక్ మార్కెట్లో కొత్తగా పెట్టుబడులు పెడతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగులకు ఉన్న అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు తమ నైపుణ్యం ద్వారా అధికారంలో నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : గతంలో కంటే ఇప్పుడు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper
Exit mobile version