Homeఆధ్యాత్మికంToday 4 July 2025 Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు శుభ ఫలితాలు..

Today 4 July 2025 Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు శుభ ఫలితాలు..

Today 4 July 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో సోమవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలు వందనున్నారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. కొందరు మోసం చేసే అవకాశం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. డబ్బు కొరత ఉండే అవకాశం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా కష్టపడతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే మంచి పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. కొందరు మీ పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల సలహాతో పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇంటి పనుల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అయితే కొత్తవారితో ఆర్థిక వివరాలు జరిపేటప్పుడు ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని రంగాల్లో ఆ అదృష్టం కలిసి వస్తుంది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని అనేక పెట్టుబడులు పెడతారు. వీటి ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చట్టపరమైన చెక్కుల నుంచి విముక్తి పొందుతారు. జీవిత భాగస్వామిగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కొన్ని విద్యాసంస్థల నుంచి విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉత్సాహంతో పనిచేయడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర విషయాలపై దూరంగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యేవారు శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఊహించడానికి అంటే లాభాలు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ప్రణాళిక ప్రకారంగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంలో తీవ్రంగా కృషి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా కొత్త ప్రాజెక్టు అందుతుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. కొన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కొందరితో వీటిని పరిష్కరించుకుంటారు

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. . ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు చేపట్టిన లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలకు దూరంగా ఉండాలి. కొందరికి శుభ ఫలితాలు ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని నమ్మకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తల్లిదండ్రుల కోసం సమయం కేటాయించాలి. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బు కొరత ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులపాటు వెయిట్ చేయడం మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. కొన్ని తప్పుల నుంచి బయటపడతారు. తోటి వారితో ఉద్యోగులు సంయమనం పాటించాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular