Today 4 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులపై ఈరోజు శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అన్ని అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొత్త పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలో కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఉండనుంది. దీంతో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు అప్పులు తీరడానికి ధన సహాయం చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఇరుగుపొరుగు వారితో సంబంధాలు మెరుగుపరుతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ప్రయాణాలు చేయడం వల్ల అనేక లాభాలు పొందుతారు. శని దేవుడు అనుగ్రహం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండడంతో కొన్ని శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు తమాశక్తి సామర్ధ్యాల మేరకు మార్పులు చేసుకుంటారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరు వ్యాపారుల ఉత్సాహాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతారు. ఇలాంటి సమయంలోనే చాకచక్యంగా వ్యవహరించి సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. వీరికి శని దేవుడి అనుగ్రహం ఉండనుంది. దీంతో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు. పిల్లలు పోటీ పరీక్షలో పాల్గొంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి శని దేవుడు అనుగ్రహం ఉండడం వల్ల అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. తమ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. జీవిత భాగస్వామి మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయడంతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సపోర్టు ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. లక్ష్యాన్ని చేదించడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. ఇదే సమయంలో కాస్త ఓర్పు అవసరం.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఉద్యోగులు సంయమనంతో పాటించాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. చట్టపరమైన చెక్కుల నుంచి బయటపడతారు. అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులో ప్రత్యర్థుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : రాశి వారికి ఈ రోజు అన్ని విషయాల్లో విజయాలే ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్తారు. ఆర్థిక సంబంధించిన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు అధికంగా ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంవల్ల ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండడంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు.
