Homeఆధ్యాత్మికంToday 30 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు..

Today 30 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు..

Today 30 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనవసరపు ఖర్చులు ఉండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. మరికొన్ని రాశుల వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు తమ కెరీర్ గురించి కీలకని నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కొత్తగా పెట్టు బదులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే ఎప్పుడు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు చేసే కొత్త ప్రయత్నాలు సరైన ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు తమ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల అనుమతితోనే వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులు తమ తోటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) :. ఈ రాశి వారికి ఈ రోజు గతంలో కంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమ నైపుణ్యం ప్రదర్శన ద్వారా పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎవరితోనైనా అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు బ్యాంకింగ్ రంగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు ప్రత్యర్థి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. కుటుంబ సభ్యులకు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు రాణిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి పూర్తిల మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆశించిన మేరకు లాభాలు ఉంటాయి. అయితే కొత్త వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. ఆరోగ్య విషయంలో సంతోషంగా ఉంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్ పనులను ఈరోజు పూర్తి చేస్తారు. స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు గతంలో కంటే మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. కృషికి తగిన ఫలితం ఉంటుంది. అవసరానికి మించి ఖర్చులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోరిక మేరకు షాపింగ్ చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు సంతోషంగా గడుపుతారు. గతంలో కంటే ఎప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version